దిల్లీలో కాంగ్రెస్ శాంతియుత ర్యాలీ నిర్వహించింది. గత కొద్ది రోజులుగా దిల్లీలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింసాత్మక నిరసనలకు వ్యతిరేకంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఈ ర్యాలీ చేసింది.
అక్బర్ రోడ్ నుంచి రాజ్‌ఘాట్ వరకు తలపెట్టిన ఈ ర్యాలీని పోలీసులు జన్‌పథ్ రోడ్ వద్ద అడ్డుకున్నారు. దీంతో నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. మహాత్మా గాంధీని స్మరిస్తూ పాటలు పాడారు. ఐకమత్య నినాదాలు చేశారు.
ఈ ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలా పాల్గొన్నారు.