ETV Bharat / bharat

ఆ మాస్టారు చెప్పే 'లౌడ్​ స్పీకర్​ క్లాసు'లకు పిల్లలు ఫిదా

కరోనాకాలంలో అధునాతన సాంకేతికతను వినియోగించి.. విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాసులు చెబుతున్నారు టీచర్లు. కానీ, ఝార్ఖండ్​లోని ఓ ఉపాధ్యాయుడు మాత్రం పాతకాలం పద్ధతులనే వాడుతున్నారు. గ్రామాల్లో చెట్లకు, స్తంభాలకు స్పీకర్లు కట్టేసి... పాఠాలు బోధిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, అంతర్జాలం సదుపాయం లేని పేదలకూ విద్యా ఫలాలు పంచుతూ... "సూపర్​ సార్​" అనిపించుకుంటున్నారు.

Classes on loudspeaker: Jharkhand teacher beats odds of online learning
'లౌడ్​స్పీకర్​ క్లాసులు' పెట్టిన సారు.. పిల్లల మనసు దోచారు!
author img

By

Published : Jun 26, 2020, 2:51 PM IST

ఉపాధ్యాయులకు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుందంటారు.. ఆ మాట ఝార్ఖండ్​లో అక్షర సత్యమైంది. అవును, కరోనా కారణంగా ఆన్​లైన్​ క్లాసులమయమైన విద్యార్థుల ప్రపంచాన్ని... లౌడ్​స్పీకర్లతో మార్చేశారు డుమ్కా జిల్లాలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యాంకిషోర్​ సింగ్​ గాంధీ.

Classes on loudspeaker: Jharkhand teacher beats odds of online learning
చదువు చెప్పే స్పీకర్లు...

పిల్లల పరిస్థితి విని...

లాక్​డౌన్​ వేళ ఆన్​లైన్​ క్లాసులు విద్యార్థులకు బాగానే ఉపయోగపడుతున్నా.. చదువు'కొనలేని' పేద విద్యార్థులు మాత్రం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కంప్యూటర్లు, స్మార్ట్​ ఫోన్లు లేక..., అవి ఉన్నా గ్రామాల్లో మొబైల్ సిగ్నల్స్, కరెంటు లేక... ఆన్​లైన్​ క్లాసులు వినడం అసాధ్యంగా మారింది. దీంతో, బంకటి గ్రామంలోని విద్యార్థుల కోసం హెడ్​మాస్టర్ శ్యాం ఓ ఉపాయం చేశారు.

చెట్టుకింద చదువులు..

​కొన్ని లౌడ్​ స్పీకర్లు తెచ్చి చెట్లకు, స్తంభాలకు కట్టేశారు. ఏప్రిల్​ 16 నుంచి రోజుకు రెండు గంటల పాటు పాఠాలు బోధిస్తున్నారు.

"ఆ స్కూల్లో 1వ తరగతి నుంచి 8 తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 246. కానీ అందులో 204 మందికి అసలు మొబైల్​ ఫోన్లే లేవు. మరి అలాంటప్పుడు వారి చదువు సాగేదెలా? అందుకే, ఈ ఉపాయం చేశాం. ఎవరికైనా అర్థం కాకపోతే.. వారి అనుమానాలను ఎవరి ఫోన్లో నుంచైనా మాకు మెసేజ్​ చేస్తే.. మేము వాటిని మరుసటి రోజు వివరిస్తాం. ఈ కొత్త పద్ధతి విద్యార్థులకు బాగా నచ్చింది. పాఠాల్ని బాగా అర్థం చేసుకుంటున్నారు. "

-శ్యాంకిషోర్​ సింగ్​ గాంధీ, ప్రధానోపాధ్యాయులు

ఒకేసారి అందరూ చదువుకోవచ్చు...

కేరళ వాలన్​చెరీలోని 9వ తరగతి విద్యార్థి ఆన్​లైన్​ క్లాసులకు హాజరు కాలేకపోయినందుకు ఒంటికి నిప్పంటించుకుంది. ఇలాంటి పరిస్థితి మరే విద్యార్థికి రాకూడదని పేద పిల్లల వసతుల గురించి ఆలోచించి... ఈ లౌడ్​ స్పీకర్​ క్లాసులు పెట్టిన శ్యాం ఆలోచనకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. డుమ్కా జిల్లా విద్యాధికారి పూనమ్​ కుమారి.. జిల్లాలోని 2,317 ప్రభుత్వ పాఠశాలలు ఇదే పద్ధతిని అనుసరించి.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా, సిలబస్​ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

లౌడ్​స్పీకర్​ క్లాసులు వింటున్న విద్యార్థులు...

ఇదీ చదవండి:వారికి స్మార్ట్​ఫోన్లే లేవ్- మరి ఆన్​లైన్​లో చదువెలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.