ETV Bharat / bharat

పదవీ విరమణ తరుణంలో జస్టిస్​ గొగొయి నూతన రికార్డు..!

author img

By

Published : Nov 16, 2019, 6:00 AM IST

Updated : Nov 16, 2019, 7:15 AM IST

పదవీ విరమణ తరుణంలో నూతన రికార్డు నెలకొల్పారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి. 650మంది న్యాయమూర్తులు, 15000 మంది న్యాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. న్యాయ వ్యవస్థలోని ప్రతి ఒక్కరూ జాతి నిర్మాతలని వ్యాఖ్యానించిన ఆయన కోర్టుల్లో సరైన మౌలిక వసతులు లేవని అభిప్రాయపడ్డారు.

పదవీ విరమణ తరుణంలో జస్టిస్​ గొగొయి నూతన రికార్డు..!

ఆదివారం పదవీ విరమణ చేయనున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నూతన రికార్డు నెలకొల్పారు. దేశంలోని 650మంది న్యాయమూర్తులు, 15 వేలమంది జిల్లా, తాలుకా న్యాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆయన సంభాషించారు. కోర్టుల్లో సరైన మౌలిక వసతులు లేవని పేర్కొన్న ఆయన కొంతమంది న్యాయవాదులతో.. న్యాయాధికారులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వ్యాఖ్యానించారు.

ఉద్యోగంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యలను అధిగమించి మరింత సంకల్పంతో న్యాయమూర్తులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జడ్జిలు పెండింగ్ కేసులను తగ్గించేందుకు కృషి చేస్తున్నారంటూ అభినందించారు జస్టిస్​ గొగొయి. న్యాయవ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ జాతి నిర్మాతలని అభిప్రాయపడ్డారు.

ప్రధాన న్యాయమూర్తిగా తన పదవీకాలం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు జస్టిస్​ గొగొయి.

"మన వ్యవస్థ నిరంతర కృషి, త్యాగం, న్యాయంకోసం పోరాడే దేశ పౌరుల భుజస్కంధాలపై ఉంది. అసమానతలు, సామాజిక ఆర్థిక తిరుగుబాటు, వివిధ రకాల సమస్యలపై మీ పనితీరు ద్వారా న్యాయంపై ఆశ నిలబెట్టండి."

-వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా జస్టిస్​ రంజన్​ గొగొయి

ఇదీ చూడండి: రాజ్​నాథ్​ అరుణాచల్​ప్రదేశ్​ పర్యటనపై చైనా అభ్యంతరం

New Delhi, Nov 15 (ANI): Chief Justice of India (CJI) Ranjan Gogoi was given farewell at the Supreme Court premises on November 15 in Delhi. Today is CJI Gogoi's last working day at Supreme Court. He is slated to retire on November 17. The 64-year-old 46th CJI of India is the son of former Assam chief minister Kesab Chandra Gogoi and was born in Dibrugarh. Justice SA Bobde will take over as CJI after Gogoi demits office.
Last Updated : Nov 16, 2019, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.