ETV Bharat / bharat

ఆన్​లైన్​లో 'ఏఐ' పాఠాలు.. గిన్నిస్​ బుక్​లో చోటు - సీబీఎస్ఈ అర్టిఫిషియల్​ ఇంటిలిజెన్స్​

24 గంటలు.. 13 వేల మంది విద్యార్థులు.. ఒకే పాఠ్యాంశం.. కలిస్తే ఓ ప్రపంచ రికార్డు సాధ్యమైంది. ఇంటెల్​, సీబీఎస్​ఈ సంస్థలు సంయుక్తంగా ఈ ఘనత దక్కించుకున్నాయి. ఆన్​లైన్​లో అత్యధిక మందికి కృత్రిమ మేధకు సంబంధించిన పాఠాలు చెప్పగా.. గిన్నిస్​ పుస్తకంలో పేరు నమోదైంది.

cbse intel has created guinness world reocrd
ఆన్​లైన్​లో 'ఏఐ' పాఠాలు.. గిన్నిస్​ బుక్​లో స్థానం
author img

By

Published : Oct 15, 2020, 5:45 AM IST

Updated : Oct 15, 2020, 6:26 AM IST

ఇంటెల్​, సీబీఎస్​ఈ సంస్థలు ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాయి. 24 గంటల్లోనే అత్యధిక మందికి ఆన్​లైన్​లో 'కృత్రిమ మేధ'(ఏఐ) పాఠం చెప్పి.. గిన్నిస్​ బుక్​లో చోటు సంపాదించాయి. ఎనిమిది ఆపై తరగతులకు చెందిన 13,000 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.

'అందరూ తెలుసుకోవాలి'..

ఇంటెల్​, సీబీఎస్​ఈ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన యూత్​ వర్చువల్​ సింపోసియం కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణను నిర్వహించాయి. అక్టోబర్​ 13, 14 తేదీల్లో ఈ తరగతులు జరిగాయి.

"రాబోయే రోజుల్లో సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రాథమిక దశలోనే ప్రతి విద్యార్థి.. ఏఐ గురించి తెలుసుకోవాలి. ఈ కార్యక్రమంతో ప్రపంచ రికార్డును సృష్టించిన ఇంటెల్​, సీబీఎస్​ఈ సంస్థలకు అభినందనలు."

-- బిస్వజిత్​ సాహా, సీబీఎస్​ఈ ట్రైనింగ్స్​ అండ్​ స్కిల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్.

'వాళ్ల.. ఆసక్తి బయటపడింది'

ఈ శిక్షణా కార్యక్రమంలో విద్యార్థులతో పాటు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులూ హాజరయ్యారు. జాతీయ, అంతర్జాతీయ వక్తలు ఇందులో పాల్గొని కృత్రమ మేధకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

"సీబీఎస్​ఈతో మా కలయిక వల్ల కృత్రిమ మేధ గురించి దేశంలోని ఎంతో మంది విద్యార్థులకు అవగాహన కలిగింది. సీబీఎస్​ఈ పాఠశాలల్లో ఏఐ నైపుణ్య ప్రయోగశాలలను ఏర్పాటు చేసేందుకు దోహదం చేసింది. ఈ ప్రపంచ రికార్డుతో నూతన ఆవిష్కరణల పట్ల భారతీయ యువతకు ఉన్న ఆసక్తిని తెలుసుకోగలిగాం. "

--శ్వేత ఖురానా. ఇంటెల్​ గ్లోబల్​ పార్ట్​నర్​షిప్స్​ అండ్​ ఇనిషియేటివ్స్​.

ఇదీ చూడండి:రోజంతా శవపేటికలో.. తెరిచి చూస్తే ప్రాణంతో

Last Updated : Oct 15, 2020, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.