ETV Bharat / bharat

బిహార్​ బరి: సం'కుల' సమరంలో గెలుపు ఎవరిది?

బిహార్​ రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. వర్గపోరు, అవకాశవాద పొత్తులు, ఎత్తులకు పైఎత్తులు, వేగంగా మారే పార్టీల ఎజెండాలు.. వెరసి మాస్​ పాలిటిక్స్​కు అడ్డాగా నిలుస్తుంది బిహార్​ గడ్డ. అయితే, వీటన్నింటికీ మించి రాజకీయాన్ని రక్తి కట్టిస్తుంటుంది కులం కార్డు. గెలుపు తీరాలకు చేరాలంటే సామాజిక వర్గాల 'సరిగమలు' సరిగ్గా పలకాల్సిందేనని బలంగా విశ్వస్తుంటుంది బిహారీ నేతాగణం.

Bihar elections
బిహార్​ సం'కుల' సమరం
author img

By

Published : Sep 28, 2020, 5:32 PM IST

బిహార్​ రాజకీయాలు-కుల సమీకరణలు... ఈ రెండింటినీ వేరుగా చూడలేమంటారు విశ్లేషకులు. 2020 బిహార్​ శాసనసభ ఎన్నికల వేళ.. మరోసారి కులం అస్త్రాలను బయటకు తీసుకొచ్చాయి అన్ని పార్టీలు. సింహాసనం దక్కాలంటే.. ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవాల్సిందే అన్న ధోరణిలో వ్యూహప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

కులం కార్డే.. గెలుపు కార్డు

ఒకటిన్నర దశాబ్దం కిందట.. అంటే 2005లో భాజపా అండతో నితీశ్​ కుమార్​ పట్నా గద్దెనెక్కారు. ఇక అప్పటినుంచి కొనసాగుతోంది ఈ విజయ ప్రస్థానం. 2010లో నితీశ్ పార్టీ పొత్తులో భాగంగా 141 స్థానాల్లో పోటీ చేసి.. 115 సీట్లు కైవసం చేసుకుంది. నాడు భాజపా 102 సీట్లలో నిలబడి.. 91స్థానాలు దక్కించుకుంది. అయితే, నితీశ్​కు భాజపాకు దూరం పెరిగిన ప్రతిసారి మారిన బిహార్​ రాజకీయాల్లోకి.. కొత్త శక్తులు దూసుకొచ్చాయి. కొత్త సమీకరణలు పుట్టుకొచ్చాయి.

తరాలు మారినా, పార్టీలు ఏవైనా.. అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్లినా.. సామాజిక వర్గాల సమీకరణలు మాత్రం ఎప్పుడూ దూరం కాలేదు. బిహార్​ను కాంగ్రెస్​ ఏలినంత కాలం.. రాజకీయాల్లో కులం కార్డును అద్భుతంగా వినియోగించుకుంది. దశాబ్దాల పాటు అధికారం అనుభవించింది. అయితే, దిల్లీ అధిష్ఠానం​ నుంచే అన్ని ఆదేశాలు రావటం వల్ల.. స్థానిక రాజకీయాలపై పెద్దగా దృష్టిసారించలేదు.

ఇక దేశంలో సామాజిక వర్గాల లెక్కలను పూర్తిగా మార్చేసిన మండల్ కమిషన్​ తర్వాత.. బిహార్​లోనూ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం అనంతరం అక్కడ సమీకరణలు పూర్తిగా కొత్తరూపు దాల్చాయి. అదే సమయంలో మండల్ కమిషన్​ ద్వారా.. లాలూ ప్రసాద్​ యాదవ్​ వెలుగులోకి వచ్చారు. ఇక లాలూ మార్కు రాజకీయం.. బిహార్ కుల రాజకీయాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్లింది. కాంగ్రెస్​ సైతం ఆయనను అనుసరించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇదీ చూడండి: బిహార్​ ఎన్నికల ఫైట్​​: ఎవరి సత్తా ఎంత..?

లాలూ రూటే సెపరేటు

ఇక లాలూ.. అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా కొత్త రాజకీయాలకు తెరదీశారు. సోషల్​ ఇంజినీరింగ్​లో ఆరితేరిన ఆయన.. సామాజిక వర్గాల ఏకీకరణతో ఓటు బ్యాంకు పెంచుకున్నారు. అందరినీ కలుపుకుపోయే లాలూ.. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ అణగారిన వర్గాలకు అండగా ఉంటానన్న భరోసా కల్పించారు. అందుకు సగటు బిహారీలా కనిపించే ఆయన వేష-భాషలు బాగా తోడ్పడ్డాయి. వేగంగానే అధికార పీఠాన్ని అధిష్ఠించారు.

ఇలా తనదైన మార్కుతో.. సోషల్​ ఇంజినీరింగ్​ విధానాలతో 1990 నుంచి 2005 వరకు 15 సంవత్సరాల పాటు ఆర్జేడీని అధికారం ఉంచగలిగారు లాలూ ప్రసాద్. మండల్​ కమిషన్ ద్వారా ​ముస్లిం-యాదవ్​ సమీరకరణాన్ని సమర్థంగా ఉపయోగించుకుని ఓటు బ్యాంకు సృష్టించుకోగలిగారు. మూడో సారి అధికారంలోకి వచ్చే క్రమంలో రిజర్వేషన్లను సైతం సమ్మోహనాస్త్రంగా వినియోగించుకున్నారు.

అయితే, లాలూ ఎక్కువగా కుల రాజకీయాలనే నమ్ముకోవటం కాస్త బెడిసికొట్టింది. ఈ తరుణంలో రాష్ట్రాభివృద్ధి పేరుతో బరిలోకి దిగిన నితీశ్​ కుమార్..​ లాలూకు షాక్ ఇచ్చారు. భాజపాతో కలిసి 2005లో అధికారం దక్కించుకున్నారు. అయితే, పరిస్థితికి అనుగుణంగా వ్యూహం మార్చిన లాలూ.. రాం విలాస్​ పాసవాన్​తో జట్టుకట్టి 2009 లోక్​సభ ఎన్నికల్లో సత్తాచాటారు.

ఇదీ చూడండి: బిహార్​లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే..

నిలబడిన నితీశ్​

నితీశ్​ కుమార్​, అధికారంలోకి వచ్చాక మెల్లిగా సామాజిక వర్గాల తేనె తెట్టెను కదిలించటం మొదలుపెట్టారు. బిహార్​లో దళితులను.. వెనుకబడిన వర్గాల నుంచి బయటకు తీసుకొచ్చి అత్యంత వెనుకబడిన వర్గం.. ఎంబీసీగా చేశారు. ఈ మహాదళిత్​ సామాజిక వర్గంలోకి 21 ఉపకులాల దళితులను చేర్చారు. ఈ నేపథ్యంలో మహాదళిత్​గా ఉన్న రాం విలాస్​ పాసవాన్.. సొంతంగా ప్రజల్లో ఆదరణ కూడగట్టుకోవటం ఆరంభించారు.

ఈ మహాదళిత్​ కేటగిరీని నితీశ్​ కుమార్ వేసిన​ గొప్ప ఎత్తుగా అభివర్ణిస్తారు విశ్లేషకులు. ఎందుకంటే భాజపాతో జట్టు కట్టినంత కాలం.. యాదవులు-ముస్లిం ఓట్లు పడవని నితీశ్​కు తెలుసు. కానీ, బిహార్​ గద్దెనెక్కాలంటే ఈ ఓట్లు కీలకం. ఈ నేపథ్యంలోనే మహాదళిత్ వర్గంతో ఓట్లు కొల్లగొట్టాలని భావించి... 2010లో సఫలీకృతం అయ్యారు. నితీశ్​ సారథ్యంలో జేడీయూ రెండోసారి అధికారం చేజిక్కించుకుంది.

2010 ఎన్నికల్లో నితీశ్​ మహాదళిత్ వ్యూహం... లాలూ సంప్రదాయ రాజకీయంపై దెబ్బకొట్టింది. దాదాపు 10% మహదళిత్ ఓట్లు, 4% దళితుల ఓట్లు ఎన్డీఏకి బదిలీ అయ్యాయి.​ ఆ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. అయితే, 2014లో ఎన్డీఏలో వచ్చిన విభేదాల వల్ల నితీశ్​ భాజపాకు దూరం జరిగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా హవా ముందు ఏ కులం కార్డు పనిచేయలేదు. కాషాయం పార్టీతో జట్టుకట్టిన పాసవాన్ లాభపడ్డారు.

ఇదీ చూడండి: జేడీయూలోకి బిహార్​ మాజీ పోలీస్​ బాస్​

మారిన పరిస్థితులు

ఇలా 2014 ఎన్నికల్లో అన్ని సమీకరణలు, వ్యూహాలు విఫలమైన వేళ.. నితీశ్​ ముఖ్యమంత్రి పీఠంపై జీతన్​ రాం మాంఝీని కూర్చోబెట్టారు. తాను సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో కుల రాజకీయాలను సమర్థంగా వాడుకుని మరోసారి అధికార పీఠం చేజిక్కుంచుకోవాలన్న ఆశలకు... మాంఝీ తిరుగుబాటు సవాలుగా నిలిచింది. మహాదళితులకు నాయకుడిగా ప్రకటించుకున్నారు జీతన్​ రాం మాంఝీ. ఈ పరిస్థితుల్లో మాంఝీ, పాసవాన్​ మహాదళితుల ఓట్లు చీల్చటం వల్ల నిర్ణయాధికారంపై వారి పట్టు సడలింది.

మహాదళితుల్లో తన పట్టు సడలుతోందని భావించిన నితీశ్.. మాంఝీని సీఎం కుర్చీ నుంచి దించేశారు. జీతన్​ రాం మాంఝీ హిందుస్థాన్​ అవామ్​ మోర్చా పార్టీ స్థాపించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో.. నితీశ్​-లాలూ పొత్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 2015 శాసనసభ ఎన్నికల్లో జేడీయూ-ఆర్జేడీ కలిసి పోటీకి దిగాయి.

భాజపా మాత్రం భిన్నంగా ఆలోచించింది. కమలదళం.. ఎల్జేపీ, మాంఝీ హెచ్​ఏఎంలో పొత్తు పెట్టుకుంది. 2015లో వారు అడిగినన్ని స్థానాలు కేటాయించి బరిలోకి దిగింది. అయితే, ఫలితాలు మాత్రం వారి అంచనాలను తలకిందులు చేశాయి. నితీశ్ కుమార్ మహాదళితుల కార్డు, లాలూ మార్కు రాజకీయం వారి కూటమికి అధికారం కట్టబెట్టాయి. కానీ, మారిన పరిస్థితుల కారణంగా ఈ పొత్తు ఎక్కువరోజులు నిలవలేదు. నితీశ్​ తిరిగి భాజపాతో కలిసి కూర్చీపై కూర్చున్నారు.

ఇదీ చూడండి: బిహార్​ భాజపా ఆశలు మోదీ బొమ్మపైనే!

ప్రస్తుత పరిస్థితేంటి ?

2020నాటికి పరిస్థితుల్లో అనేక మార్పులొచ్చాయి. మహాకూటమిలో ఇమడలేకపోయిన మాంఝీ తిరిగి నితీశ్​ పంచన చేరారు. కేంద్ర రాజకీయల్లోకి వెళ్లిన రాం విలాస్​ పాసవాన్.. బిహార్​ బాధ్యతలను చిరాగ్​ పసవాన్​కు అప్పగించారు. ఈ పరిస్థితుల్లో మహాదళిత్​ ప్రతినిధిగా నిలిచేందుకు మాంఝీ, చిరాగ్​ పోటీపడుతున్నారు. అయితే, ఇప్పటికీ ఈ రెండు పార్టీలు ఎన్డీఏ గూటిలోనే ఉన్నాయి.

కూటమిలో తగిన ప్రాధాన్యం దక్కటం లేదని భావిస్తోంది ఎల్జేపీ. క్రమంగా ఇది భాజపా, నితీశ్​ మధ్య సామాజిక వర్గాల ఓటు బ్యాంకు పోరుగా మారుతోంది. నితీశ్​ మరోసారి మహాదళిత్​ మ్యాజిక్​ చేయాలని భావిస్తుంటే.. ఎల్జేపీ సాయంతో ఈ వర్గాన్ని ఆకట్టుకోవాలని భాజపా చూస్తోంది. మొత్తంగా ఎల్జేపీ-హెచ్​ఏఎం మధ్య రాజకీయ రగడ.. జేడీయూ-భాజపా కులం కార్డు రాజకీయాలను ప్రభావితం చేయనుంది.

ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ ముస్లిం-యాదవ ఓటర్లలో బలంగా ఉన్న ఆర్జేడీ.. యువ నాయకుడు తేజస్వీ యాదవ్​ నేతృత్వంలో విభిన్న పంథాతో ముందుకెళ్తోంది. అభివృద్ధితో పాటు యువత-నిరుద్యోగం వంటి అజెండాతో బరిలోకి దిగుతోంది. నితీశ్​ కుమార్​ ఆయుధంతోనే ఆయనను ఓడించాలనే ఆలోచనతో తేజస్వీ ముందుకెళ్తున్నారంటున్నారు విశ్లేషకులు. వీరిలో ఎవరి వ్యూహం ఫలిస్తుందో నవంబర్ 10న తేలనుంది.

ఇదీ చూడండి: అధికారమిస్తే.. 10లక్షల ఉద్యోగాలు: ఆర్జేడీ

ఇదీ చూడండి: కరోనా పడగ నీడలో ఎన్నికలు... సాధ్యమేనా?

ఇదీ చూడండి: బిహార్​ ఫైట్​: ఎన్నికల నగారా మోగిందోచ్​..

ఇదీ చూడండి: ఎన్నికల రణక్షేత్రంలో 'బిహార్​ కా షేర్' ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.