పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశవ్యాప్తంగా అనేక తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేరళ, బంగాల్ సహా కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ రాష్ట్రంలో అమలు చేయబోమంటూ ప్రకటనలు చేస్తున్నాయి.
దేశంలో 'పౌరసత్వ' మంటలు చెలరేగుతున్న వేళ ఈ అంశాన్ని సిలబస్‌గా తీసుకొచ్చేందుకు లఖ్‌నవూ విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ విభాగం ముందుకొచ్చింది. ఈ అంశాన్ని పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు బోధనాంశంగా పరిచయం చేయాలని యోచిస్తోంది.
''పొలిటికల్ సైన్స్ కింద సీఏఏను మేం తీసుకురావాలనుకుంటున్నాం. ఇప్పుడిది చాలా ముఖ్యమైన అంశం. అందువల్ల దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అసలు పౌరసత్వ చట్టం ఏమిటి? ఎందుకు? దీన్ని ఎలా సవరణ చేశారు? అనేది తెలుసుకోవడం అవసరం. అయితే, ఇది భారత రాజకీయాల్లో సమకాలీన అంశంగా ఉంది. అందువల్లే దీన్ని మా విద్యార్థుల సిలబస్‌లో ఈ అంశాన్ని చేర్చాలనుకుంటున్నాం. అయితే ఇప్పటివరకు ఇదొక ప్రతిపాదనగానే ఉంది.''
-శశి శుక్లా పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి
ఇదీ చూడండి: 'ప్రభుత్వ పరిపాలనకు రాజ్యాంగమే పవిత్రగ్రంథం'