ఉత్తరాఖండ్ పితోర్గఢ్ జిల్లాలో భారత్- చైనా సరిహద్దులో ఓ వంతెన కూలిపోయింది. భారీ నిర్మాణ యంత్రాన్ని తీసుకెళ్తున్న లారీ... బ్రిడ్జ్ దాటే సమయంలో ఒక్కసారిగా నెలకొరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. రాష్ట్రంలోని లిలాం జోహార్ లోయలోని మున్సారీ తహసీల్ వద్ద ఉన్న ధపా మిలాం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
మిలాం నుంచి చైనా సరిహద్దు వరకు 65 కిలోమీటర్ల మోటారు మార్గాన్ని నిర్మించడానికి ఆ నిర్మాణ యంత్రాన్ని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే, వంతెన కూలిపోవడం వల్ల సరిహద్దు ప్రాంత గ్రామాల్లోని 7000 మందికి పైగా ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్మీ, ఐటీబీపీ దళాల ప్రయాణాలకూ విఘాతం కలిగింది.
ఇదీ చూడండి: చైనాతో 2 యుద్ధాలు.. గెలిచే దాకా వెనక్కితగ్గొద్దు!