నవంబర్ 26న.. 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా 10 రోజులపాటు నిర్వహించాలని భాజపా ప్రభుత్వం యోచిస్తోంది. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న అమల్లోకి వచ్చింది.
ప్రజలందరూ చూసేలా..
వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లోని ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగాన్ని ప్రజలందరూ చూసేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్ని రాష్ట్రాల్లోని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మోదీ పాలన గురించి అర్థమయ్యేలా చెప్పండి..
'సంవిధాన్ దివస్'(రాజ్యాంగ దినోత్సవం)లో భాజపా కార్యకర్తలు, సామాన్య ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని అమిత్షా విజ్ఞప్తి చేశారు. అలాగే భాజపా ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు తెలియజేయాలని పార్టీ జిల్లా ఇన్ఛార్జీలకు ఒక ప్రకటన కూడా జారీచేశారు. ఎన్డీఏ హయాంలో ప్రజాస్వామ్య విలువలు ఎలా బలపడుతున్నాయో కూడా సామాన్యులకు వివరించాలని దిశానిర్దేశం చేశారు.
మోదీ ఎలా పరిపాలన చేస్తున్నారో.. తమ హయాంలో పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం శివసేనదే..!