విశ్వ యోగా దినోత్సవం సందర్భంగా రాజస్థాన్లో ఓ భాజపా పార్లమెంట్ సభ్యుడు అగ్ని యోగా సాధన చేశారు. ఓ పక్క ఎండ మండిపోతున్నా.. అగ్నివలయం నుంచి కదలలేదు ఆ ఎంపీ. అంతే కాదు... ఒళ్లంతా బురద పూసుకుని బురద స్నానం ఆచరించారు. జిమ్లో వ్యాయామం చేసి ప్రజలకు ఫిట్నెస్పై అవగాహన కల్పించారు.

టోంక్ జిల్లా, సవాయ్ మాధోపుర్ నియోజకవర్గం ఎంపీ సుఖ్బీర్ సింగ్ జోనాపురియా.. రోజుకు దాదాపు 4 గంటల పాటు వ్యాయామం, యోగా చేస్తారు. ఇలా చేసి కేవలం నాలుగు నెలల్లో దాదాపు 25 కిలోలు బరువు తగ్గారు. అందుకే, ఆయన పాటించిన ఫిట్నెస్ మంత్రాను ఈ తరం యువకులూ పాటించాలంటున్నారు. మనకంటూ మనం రోజుకో రెండు గంటల సమయాన్ని కేటాయించుకుని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.


ఇదీ చదవండి:'రాహుల్జీ.. స్పెల్లింగ్ సరిచూడండి.. పరువుపోతోంది!'