బిహార్‌లో ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ విడుదల చేసింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోడా ప్రకటించారు. అక్టోబర్ 28న తొలిదశలో 71 స్థానాలకు, నవంబరు 3న రెండో దశలో 94 స్థానాలకు, నవంబరు 7న మూడో దశలో 78 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక నవంబరు 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు.
నిబంధనలు-జాగ్రత్తలు..
>> అభ్యర్థన,అవసరం మేరకు అందుబాటులో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం.
>> ఎన్నికల ప్రచారాల్లో భాగంగా నిర్వహించే సామూహిక సమావేశాల్లో భౌతిక దూరం తప్పనిసరి.
>> సామాజిక మాధ్యమాల వేదికగా ద్వేషపూరిత ప్రసంగాలపై కఠిన చర్యలు.
>> నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థితో సహా ఇద్దరికి మాత్రమే అనుమతి.
>> ఇంటింటి ప్రచారంలో అభ్యర్థితో సహా గరిష్ఠంగా ఐదుగురికే ఛాన్స్.
>> 7 లక్షల శానిటైజర్లు, 46 లక్షల మాస్కులు, 6 లక్షల పీపీఈ కిట్లు, 6.7 లక్షల ఫేస్ షీల్డ్లు, 23 లక్షల జతల చేతి తొడుగులు సిద్ధం.