భార్య- భర్తల మధ్య గొడవలు జరిగి విడిపోతుండటం చూస్తూనే ఉంటాం. కానీ తానే తెలివైనవాడని.. తన భర్త నిరంతరం తనతో వాదిస్తున్నాడంటూ ఓ మహిళ విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది.
'తెలివి' వల్లే..
అతను ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆమె వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకున్న మహిళ. వారి 30ఏళ్ల కాపురంలో ముగ్గురు పిల్లలు. కానీ, ఇద్దరి వైవాహిక జీవితంలో 'తెలివి' అనే అహం అడ్డొచ్చింది. 'నేనే తెలివైన వాడిని' అంటూ భర్త మాట్లాడుతుంటాడు. ఇదే వీరి మధ్య గొడవకు కారణమైంది. 'నీకంటే నాకే ఎక్కువ తెలివి ఉంద'ని పరస్పరం వాధించుకోవడం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకుంది ఆ మహిళ. భర్త కేసు వెనక్కి తీసుకోమన్నా ససేమిరా అంటోంది. ఒకవేళ కేసు వెనక్కి తీసుకుంటే.. భర్త తెలివైనవాడని తాను అంగీకరించినట్లు అవుతుందని ఆ మహిళ చెబుతోంది. 'ఇద్దరం సంపాదిస్తున్నాం.. అలాంటప్పుడు ఇద్దరూ సమానుమే కదా?' అని ఆమె వాదిస్తోంది.
మూడేళ్లుగా దంపతులు కౌన్సిలర్‌ను సంప్రదిస్తున్నప్పటికీ.. ఎలాంటి లభాం లేకపోయింది.
ఇదీ చదవండి:జల్లికట్టు వేడుకలో అపశ్రుతి- ఇద్దరు మృతి