ETV Bharat / bharat

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ

ఐదు శతాబ్దాలుగా కోట్లాది మంది హిందువులు ఆకాంక్షిస్తున్న జగదభిరాముడి భవ్య మందిర నిర్మాణానికి తొలి అడుగు పడింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరిగింది. 29 ఏళ్ల క్రితం రామమందిరం కోసం చేసిన ప్రతిజ్ఞను ప్రధాని హోదాలో పునాదిరాయి వేయడం ద్వారా నరేంద్రమోదీ నెరవేర్చుకున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రామాలయ భూమిపూజ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించారు.

Bhoomi Pujan concludes, PM Modi lays Ram Temple foundation stone
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ
author img

By

Published : Aug 5, 2020, 6:05 PM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. రామజన్మభూమిలో కోదండ పాణి దివ్యమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు. పండగ వాతావరణంలో ఈ మహాక్రతువును నిర్వహించారు. అయోధ్యలో హనుమాన్‌ ఆలయం నుంచి రామజన్మభూమికి చేరుకున్న ప్రధాని మోదీ.. తొలుత ప్రత్యేక పూజలుచేశారు. ప్రత్యేకంగా అలంకరించిన సీతారామలక్ష్మణ విగ్రహాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. రామ్‌లల్లాకు హారతి ఇచ్చారు. అనంతరం ప్రదక్షిణ చేసి హుండీలో దక్షిణ వేశారు మోదీ. అదే ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటి నీళ్లు పోశారు.

వేదపఠనం, మంత్రోచ్ఛరణల మధ్య.. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్నంలో వెండి ఇటుకలతో ఆలయానికి శంకుస్థాపన చేశారు మోదీ. 1989 నుంచి ప్రపంచం నలుమూలల ఉన్న రామభక్తులు మందిర నిర్మాణానికి పంపిన 2 లక్షల 75 వేల ఇటుకల్లో జై శ్రీరామ్‌ అని రాసిన వంద ఇటుకలను భూమిపూజ కోసం ఎంపిక చేశారు. వాటిలో 9 ఇటుకలను పునాదిరాయి కోసం వినియోగించినట్లు పూజారులు తెలిపారు.

Bhoomi Pujan concludes, PM Modi lays Ram Temple foundation stone
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ

11 పవిత్ర ప్రదేశాల నుంచి మట్టి

గంగా, యమున, సరస్వతి.. త్రివేణి సంగమం నుంచే కాకుండా దేశంలోని 11 పవిత్ర ప్రదేశాల నుంచి తీసుకొచ్చిన మట్టి, జలాలను భూమిపూజ కార్యక్రమంలో వినియోగించారు.

175 మంది అతిథులు..

ఈ కార్యక్రమంలో వేదికపై ప్రధాని మోదీతో పాటు యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్​ఎస్​ఎస్​ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, రామమందిర తీర్ధ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ పాల్గొన్నారు. మొత్తం 175 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.