దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముస్లింలు నూతన వస్త్రాలు ధరించి ఉదయమే మసీద్‌లకు తరలివచ్చారు.
దిల్లీలోని ప్రముఖ జామా మసీద్‌లో బక్రీద్ ప్రార్థనలు జరిగాయి. ముస్లింలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పంజా షరీఫ్ దర్గాలో జరిగిన బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పాల్గొన్నారు. ప్రార్థనల్లో పాల్గొన్నవారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రోడ్డుపైనే ప్రార్థనలు
ముంబయిలోనూ బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పెద్ద ఎత్తున ముస్లింలు తరలివచ్చారు. హమ్మదీయ మసీద్ వద్ద స్థలం సరిపోని కారణంగా రోడ్డుపైనే ప్రార్థనలు జరిపారు.
కశ్మీర్‌పై డిగ్గీ..
భోపాల్‌లో జరిగిన ప్రార్థనల్లో కాంగ్రెస్ సీనియర్‌నేత దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
బంగ్లా సైనికులతో..
పట్నాలో బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పెద్దసంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. పరస్పరం ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఆ దేశ సైనికులతో బీఎస్ఎఫ్ జవాన్లు మిఠాయిలు పంచుకున్నారు.
శ్రీనగర్‌లో పోలీసు అధికారులు
జమ్ములోనూ ముస్లింలు ఉదయమే మసీద్‌లకు చేరుకొని బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. నిషేధాజ్ఞల దృష్ట్యా మసీద్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చిన వారిని క్షుణ్నంగా తనిఖీ చేసి పంపారు.
శ్రీనగర్ మొహల్లా మసీదులో ప్రార్థనలకు వచ్చినవారిని అధికారులు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
కశ్మీర్లో ఎలాంటి హింసకు తావులేకుండా, ప్రశాంతంగా బక్రీద్ ప్రార్థనలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: జమ్ము కశ్మీర్లో ఆంక్షల నడుమే బక్రీద్