వీడియో ప్రాసెసింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ ఉపయోగించి ముఖకవళికల ద్వారా తరగతి గదిలో విద్యార్థులు ఏకాగ్రతతో ఉన్నారా లేదా తెసుకోవటానికి భారత్- సింగపూర్‌కు చెందిన విద్యార్థులు కొత్త సాంకేతికతను రూపొందించటానికి కృషి చేస్తున్నారు.
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్ఆర్డీ) నిర్వహిస్తున్న భారత్-సింగపూర్ హాకథాన్ 2019 పోటీల్లో పాల్గొనేందుకు ఈ బృందం సిద్ధమవుతోంది.
"ఈ సాంకేతికతతో ఉపాధ్యాయులు.. విద్యార్థుల మానసిక స్థితిని, అభిప్రాయాలను తెలుసుకోవచ్చు. తద్వారా వారి పనితీరు, ప్రతిభను మెరుగుపర్చేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది విద్యార్థులు ఒత్తిడికిలోనై విచారంలో మునిగిపోతున్నారు. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. విద్యార్థులు ఎక్కువగా సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు. అటువంటి వారి మానసిక, ఉద్రిక్త పరిస్థితులను ఈ బృందం విశ్లేషిస్తుంది. అవసరమైతే వారిని హెచ్చరించే విధంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు.''
-ఆర్ సుబ్రహ్మణ్యం, హెచ్ఆర్డీ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి.
ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28-29 తేదీల్లో ఈ హాకథాన్ పోటీల్ని నిర్వహిస్తున్నారు. విజేతలను సెప్టెంబర్ 30న ప్రకటిస్తారు. ఆరుగురు సభ్యులతో కూడిన 20 బృందాలు పాల్గొంటున్నాయి. పోటీల్లో గెలిచిన వారికి ఐఐటీ మద్రాసులో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బహుమానాలు ప్రదానం చేస్తారు.
ఇదీ చూడండి:ఉగ్రకుట్ర: ఆ దేశం నుంచి వచ్చినవారే టార్గెట్!