ETV Bharat / bharat

కష్టకాలంలో అమృత భాండాగారం ఈ 'అక్షయ పాత్ర' - అక్షయపాత్ర వంటశాల

లాక్‌డౌన్‌ కారణంగా బతుకుతెరువు కరవై.. స్వస్థలాలకు వెళ్లలేక ఆకలితో అలమటిస్తున్నవారి ఆకలి తీరుస్తోంది.. కర్ణాటక ధార్వాడ్‌లోని 'అక్షయ పాత్ర' వంటశాల. ఆసియాలోని అతిపెద్ద వంటశాలల్లో ఈ 'అక్షయపాత్ర' ఒకటి. రోజుకు 2.50 లక్షల భోజనాలు తయారుచేసే సామర్థ్యం దీనికి ఉంది. లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో వలసకూలీలకు, క్వారంటైన్​లోని ప్రజలకు, పోలీసులకు నిరంతరాయంగా ఆహారాన్ని అందిస్తోంది.

Asia's the biggest kitchen Akshaya Patra
లాక్​డౌన్​ వేళ... ఆకలి తీరుస్తున్న అక్షయపాత్ర
author img

By

Published : May 17, 2020, 6:41 AM IST

ఆసియాలోని అతిపెద్ద వంటశాలైన అక్షయపాత్ర

కర్ణాటక ధార్వాడ్​ జిల్లా రాయ్​పుర్​లోని​ 'అక్షయ పాత్ర'.. ఆసియాలోని అతిపెద్ద వంటశాలల్లో ఒకటి. రోజుకు 2లక్షల 50వేల భోజనాలు తయారు చేసే సామర్థ్యం దీని సోంతం. మొన్నటి వరకు మధ్యాహ్నం భోజనం కింద బడి పిల్లల కడుపు నింపిన అక్షయ పాత్ర.. ఇప్పుడు లాక్​డౌన్​ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీల ఆకలి కష్టాలను తీరుస్తోంది.

ఇన్ఫోసిస్ సహకారంతో...

ఇస్కాన్​ కృష్ణాలయానికి సమీపంలో ఉన్న ఈ భారీ వంటశాలను 2006లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇచ్చిన నిధులతో నిర్మించారు.

ఒక ఎకరం విస్తీర్ణంలో ఉండే ఈ వంటశాలలో 2 టన్నుల సామర్థ్యంగల బాయిలర్, 600 లీటర్ల సామర్థ్యం కలిగిన 11 రైస్ కుక్కర్లు ఉన్నాయి. ఒక్కో కుక్కర్​లో కేవలం 15 నిమిషాల్లో ఒక క్వింటా బియ్యాన్ని వండవచ్చు. 8 పెద్ద కంటైనర్లలో సాంబార్ తయారుచేస్తారు. ఒక్కో కంటైనర్ సామర్థ్యం 12,000 లీటర్లు. వీటిలో కేవలం 45 నిమిషాల్లోనే సాంబార్ సిద్ధమవుతుంది.

అక్షయపాత్ర వంటశాలలో ప్రతిరోజూ మూడు పూటలా వంటలు తయారవుతాయి. ఇందుకోసం మూడు షిఫ్టుల్లో 450 మంది పనిచేస్తారు. ఉదయం 3 గంటల నుంచి 9 గంటల వరకు ఆహారాన్ని వండుతారు. తరువాత వంటగదిని పూర్తిగా శుభ్రపరుస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మరోసారి వంటకాలు తయారు చేస్తారు.

మెనూ ప్రత్యేకత..

అక్షయపాత్ర మెనూకు ప్రత్యేకత ఉంది. వారంలో 4 రోజులు అన్నం, సాంబార్; ఒక రోజు పులావ్​-పప్పు; మరొక రోజు ఉప్మా, కేసరిబాత్​ తయారుచేస్తారు. సోమవారం, గురువారం గోధుమ పాయసం వడ్డిస్తారు.

61 వాహనాల్లో ధార్వాడ్​ జిల్లా పరిధిలోని 800 పాఠశాలలకు ఈ ఆహారాన్ని సరఫరా చేస్తారు. ఫలితంగా 1.31 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాలు చేస్తారు.

"కరోనా సంక్షోభం, లాక్​డౌన్ కారణంగా మధ్యాహ్న భోజనాలు అందించలేకపోతున్నాం. స్థానిక ప్రభుత్వ యంత్రాంగ చేసిన విజ్ఞప్తి మేరకు వలసకూలీలకు, క్వారంటైన్​లో ఉన్నవారికి ఆహారాన్ని అందిస్తున్నాం. మార్చి 25 నుంచి ఇప్పటి వరకు లక్షా 42వేల మందికి భోజనాలు అందించాం."

- రాజీవ లోకనాదాస్, హుబ్లి ఇస్కాన్ అధ్యక్షులు

అక్షయపాత్ర చేపడుతున్న ఈ బృహత్ కార్యక్రమానికి... ప్రభుత్వం నుంచి 60 శాతం నిధులు అందుతుండగా... మిగతా నిధులు విరాళాల ద్వారా సమకూరుతున్నాయి.

ఇదీ చూడండి: వేశ్యగృహాలు మూసేస్తే 72% కరోనా కేసులు తగ్గినట్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.