జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతి చెందగా.. ఆర్మీ జవాను ఒకరు వీరమరణం పొందారు.
దోడాకు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్టా- పోట్రా గ్రామంలో ముష్కరులు ఉన్నట్లు సమాచారం అందగా... పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టింది సైన్యం. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జవానుకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘాతకానికి పాల్పడిన ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకున్నట్లు వెల్లడించారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థకు చెందిన సభ్యుడ్ని మట్టుబెట్టినట్లు తెలిపారు.
పాక్ సైన్యం కాల్పులు...
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు. ఉదయం 8.40 గంటలకు దేగ్వార్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మన సైన్యానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు.