ETV Bharat / bharat

యూపీ 'పౌర' అల్లర్లలో 11కి చేరిన మృతులు

author img

By

Published : Dec 21, 2019, 10:44 AM IST

పౌర చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్​ప్రదేశ్​లో శుక్రవారం జరిగిన అల్లర్లలో మృతుల సంఖ్య 11కి చేరింది. ప్రార్థనల అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు రెచ్చిపోవటం వల్ల పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ నెలకొంది. సుమారు 50 మందికిపైగా భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

Anti-CAA stir
ఉత్తర్​ప్రదేశ్​ అల్లర్లలో 11కి చేరిన మృతుల సంఖ్య

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 11కి చేరింది. మేరఠ్​​ జిల్లాలో జరిగిన అల్లర్లలో నలుగురు మృతి చెందారు. వారణాసిలో పోలీసులు, ఆందోళనకారుల ఘర్షణల నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

ప్రార్థనల అనంతరం చెలరేగిన హింస..

గోరఖ్‌పూర్‌, సంభాల్‌, భదోహి, బహ్రయిచ్‌, బులంద్‌శహర్‌, ఫిరోజాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలకు నిప్పంటించారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రబ్బరు తూటాలతో కాల్పులు జరిపారు. బిజ్నోర్‌, మేరఠ్‌, సంభాల్‌, ఫిరోజాబాద్‌, కాన్పూర్‌లో ఆరుగురు మరణించారు. ఆందోళనకారుల దాడిలో 50 మందికిపైగా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు పోలీసులకు తూటాలు తగిలాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దిల్లీలో 10 మంది అరెస్ట్​..

పౌర చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని దరియాగంజ్​లో జరిగిన అల్లర్లకు సంబంధించి 10 మందిని అరెస్ట్​ చేశారు పోలీసులు. అల్లర్లు సృష్టించటం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కారణంగా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు అధికారులు.

ఇదీ చూడండి: 'పౌర'చట్టంపై అట్టుడికిన భారతావని.. ఆరుగురు మృతి

AP Video Delivery Log - 0400 GMT News
Saturday, 21 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0349: Malaysia Mahathir AP Clients Only 4245810
Mahathir highlights sanctions risk as summit ends
AP-APTN-0330: Australia Fires Plane AP Clients Only 4245808
Air passenger films bushfires burning at night
AP-APTN-0305: US AZ Police Shooting Part must credit Arizona Department of Public Safety/Part KPHO-KTVK, Must credit AZFAMILY.COM, No access Phoenix, No use US broadcast networks, No re-sale, re-use or archive 4245809
Arizona trooper kills Qatari man who attacked him
AP-APTN-0301: Australia Fires No access Australia 4245806
Bushfires burn in South Australia
AP-APTN-0302: US Trump AP Clients Only 4245807
Trump signs defence bill, creates Space Force
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.