కేరళలో షిగెల్లా వ్యాధి ఇంకా అదుపులోకి రాలేదు. చిత్తారిప్పరంబులోని ఆరేళ్ల బాలుడికి షిగెల్లా సోకినట్లు నిర్ధరణ అయింది. అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ జిల్లాలో ఇదివరకే ఒకరు షిగెల్లా బారినపడ్డారు. బాధితుల సన్నిహితులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.
ఒకసారి ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే.. ఆ వ్యక్తి కొన్నిరోజుల పాటు అనారోగ్యానికి గురవుతారు. విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపు నొప్పి, మలంలో రక్తం వంటివి ఈ షిగెల్లా సాధారణ లక్షణాలు.
తాగడం, తినడం ద్వారానే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తినే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం, కాచి చల్లార్చిన నీరు తాగడం, తాజా ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి దరిచేరకుండా కాపాడుకోవచ్చని అంటున్నారు.
ఇదీ చూడండి: కేరళలో కొత్త వ్యాధి అదుపులోకి వచ్చినట్టేనా?