ETV Bharat / bharat

దిల్లీలో 8మంది రోహింగ్యాలు అరెస్టు - రోహింగ్యాల్నిదిల్లీ పోలీసులు అరెస్టు చేశారు

సరైన ధ్రువ పత్రాలు లేకుండా దేశంలో అక్రమంగా ఉంటున్న 8మంది రోహింగ్యాలని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. తూర్పు దిల్లీలో అరెస్టైన ఆరుగురిలో ముగ్గురు మైనర్​లు ఉన్నట్లు వెల్లడించారు. వారందరిని నిర్బంధ కేంద్రాలకి తరలించినట్లు చెప్పారు.

8 Rohingyas held in Delhi
దిల్లీలో 8మంది రోహింగ్యాల అరెస్టు
author img

By

Published : Jan 17, 2021, 11:41 PM IST

సరైన ధ్రువ పత్రాలు చూపకపోవడం వల్ల 8 మంది రోహింగ్యాల్ని.. దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారంతా దిల్లీలోని వివిధ ప్రాంతాలలో అక్రమంగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు.

కాగా తూర్పు దిల్లీలో అరెస్టైన ఆరుగురిలో ముగ్గురు మైనర్​లు ఉన్నారని పేర్కొన్నారు. ఆనంద్​విహార్​ రైల్వే స్టేషన్​ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని నిర్బంధ క్యాంపులకు తరలించామని వెల్లడించారు.

రోహింగ్యాలుగా అనుమానిస్తున్న ఆరుగురు.. మయన్మార్​ నుంచి త్రిపుర ద్వారా దిల్లీకి ఓ రైలులో జనవరి 6న వచ్చినట్లు మాకు సమాచారం అందింది. ఆ ఆరుగరిలో ముగ్గురు మైనర్​లు ఉన్నారు. వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించాం.

-దీపక్​ యాదవ్​, డీసీపీ

ద్వారకా జిల్లా ఉత్తమ్​ నగర్​లో అక్రమంగా ఉంటున్న ఇద్దరు రోహింగ్యాలను శుక్రవారం అరెస్టు చేశామని ఓ సీనియర్​ పోలీసు అధికారి తెలిపారు. వారిపేర్లు హమీద్​ హుస్సేన్​(23), నబీ హుస్సేన్​ అని వెల్లడించారు. ఆ ఇద్దరు నిందితులు నవంబర్​1న బంగ్లాదేశ్​ సరిహద్దు ద్వారా భారత్​లోకి ప్రవేశించారని తెలిపారు. వారివద్ద పాస్​పోర్టు, వీసా లేవన్నారు.

ఇదీ చూడండి: మమతపై యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.