గుజరాత్‌లోని సుమారు 24 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్.. రాజస్థాన్‌కు తరలించింది. సిరోహి జిల్లాలోని అబూరోడ్‌లో ఉన్న ఓ రిసార్టులో వారిని ఉంచింది. ఈ నెల 19న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవల రాజీనామా చేయటం కలకలం సృష్టించింది.
వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలందరినీ గుజరాత్‌లోని ఆణంద్, రాజ్‌కోట్, అంబాజీల్లో ఉన్న రిసార్టులకు తరలించింది. వారిలో 21 మందిని తాజాగా రాజస్థాన్‌కు పంపించింది. మరోవైపు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిందంటూ రాజ్‌కోట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న రిసార్టుపై పోలీసులకు ఫిర్యాదు అందింది.