ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లాలో ఒక ప్రత్యేక వివాహం జరిగింది. ఒక యువకుడు ఒకే మండపంలో ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లిచేసుకున్నాడు. జగదల్‌పుర్ పట్టణం సమీపంలోని టిక్రా లోహంగా గ్రామంలో జనవరి 3న జరిగిందీ ఘటన. గిరిజన సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహానికి ఊళ్లో వారంతా అంగీకరించడం గమనార్హం. అందరికీ పెళ్లికార్డులు కూడా పంచిపెట్టాడా వరుడు.
ఊరందరి సమక్షంలోనే పెళ్లికొడుకు చందూ మౌర్య.. ఇద్దరు వధువులు హసీనా బఘేల్, సుందరి కశ్యప్‌లను మనువాడాడు. వారితో ఏడడుగులు నడిచాడు. వారిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
అయితే.. ఆ వ్యక్తి ఒకేసారి ఇద్దరినీ ఎందుకు పెళ్లి చేసుకున్నాడనేదానిపై ఎవరికీ సమాచారం లేదు. పెళ్లి వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
![A man marriage with two girls in bastar chhattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/cg-bst-01-bastaranokhishadi-av-7205404_06012021165523_0601f_1609932323_1005.jpg)
ఇదీ చూడండి: క్లైమాక్స్‌కు 'అధ్యక్ష పోరు'- ట్రంప్ ట్విస్ట్ ఇస్తారా?