ETV Bharat / bharat

సముద్రంలో తేలియాడుతూ యోగా చేసిన ఔత్సాహికులు

International Day of Yoga on Sunday
యోగా డే: ఈసారి సందడంతా నెట్టింట్లోనే!
author img

By

Published : Jun 21, 2020, 5:46 AM IST

Updated : Jun 21, 2020, 1:01 PM IST

12:58 June 21

నీటిపై తేలియాడుతూ యోగా

ప్రపంచ యోగా దినోత్సవ వేళ తమిళనాడు రామేశ్వరానికి చెందిన ఇద్దరు సాధకులు పాక్ జలసంధి వద్ద.. సముద్రంలో ఆసనాలు వేసి అబ్బురపరిచారు. నీటిపై తేలియాడుతూ ఆశ్చర్యపరిచారు.

09:58 June 21

భౌతిక దూరంతో జేపీ నడ్డా యోగా సాధన

భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ యోగా సాధన చేశారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఆసనాలు వేశారు.

09:58 June 21

ఆసనమేసిన లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా

లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా దిల్లీలోని ఆయన నివాసంలో యోగాసనాలు వేశారు. శీర్షాసనం, ప్రాణయామం చేసి యోగా ఘనతను చాటారు.

09:45 June 21

ప్రకాశ్ జావడేకర్, గిరిరాజ్​ సింగ్..

కేంద్రమంత్రులు ప్రకాశ్ జావడేకర్, ప్రహ్లాద్ పటేల్, గిరిరాజ్​ సింగ్ వారి స్వహృహాల్లో యోగా సాధన చేశారు.

09:45 June 21

ఆసనమేసిన కేజ్రీ

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యోగా చేశారు. దిల్లీలోని స్వగృహంలో ధ్యానముద్రలో నిమగ్నమయ్యారు. 

08:30 June 21

రాష్ట్రపతి కోవింద్ యోగా సాధన

ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ధ్యానంలో నిమగ్నమయ్యారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. రాష్ట్రపతి భవన్​లో యోగా సాధన చేశారు.

08:29 June 21

అశ్వాలపై యోగా సాధన

అరుణాచల్ ప్రదేశ్​లోని ఐటీబీపీ క్యాంప్​లో గుర్రాలతో యోగా చేశారు సైనికులు. గుర్రాలపై నిల్చుని చేసిన ఆసనాలు సాధన చేశారు.

08:19 June 21

యోగా దినోత్సవ వేళ.. ముఖ్యమంత్రి శీర్షాసనం

యోగా దినోత్సవ వేళ ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగెల్ శీర్షాసనం వేశారు. రాయ్​పుర్​లోని స్వగృహంలో యోగా సాధన చేశారు.

08:08 June 21

కేంద్రమంత్రుల యోగాసనాలు

కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీలు వారి స్వగృహాల్లో యోగా సాధన చేశారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ యోగా చేశారు.

07:59 June 21

భారత్- చైనా సరిహద్దులో యోగాసనాలు

భారత్- చైనా సరిహద్దులో భద్రీనాథ్​కు సమీపంలోని వసుధార మంచుకొండ వద్ద ఐటీబీపీ దళాలు   అద్భుతరీతిలో యోగా ప్రదర్శన చేశాయి. 14వేల అడుగుల ఎత్తులో చేసిన ఈ ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకర్షించింది.

07:44 June 21

18వేల అడుగుల ఎత్తులో ఆసనమేసిన ఐటీబీపీ

యోగా దినోత్సవ వేళ ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగం లద్దాక్​లో 18వేల అడుగుల ఎత్తులో ఆసనాలు వేశారు. మంచులో భద్రతా బలగాల ఆసనాలు ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయి.

06:54 June 21

  • అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగం
  • ఆన్‌లైన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
  • కరోనా ఉద్ధృతి దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాం: ప్రధాని
  • ఇంట్లోనే కుటుంబసభ్యులతో కలిసి యోగా నిర్వహిస్తున్నాం: ప్రధాని

06:51 June 21

  • ఇళ్లలోనే ఉంటూ కుటుంబసభ్యులతో కలిసి యోగా నిర్వహిస్తున్నాం: ప్రధాని
  • యావత్ ప్రపంచం యోగాను గుర్తించింది: ప్రధాని
  • రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగాలో ఆసనాలున్నాయి: ప్రధాని
  • ఇందులో ప్రాణాయామం అనే వ్యాయామం దోహదపడుతుంది: ప్రధాని
  • ప్రాణాయామం రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవాలి: ప్రధాని
  • అనేక రకాల ప్రాణాయామాలు అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది: ప్రధాని
  • రోగాలను దీటుగా ఎదుర్కొనేందుకు యోగా దోహదపడుతుంది: ప్రధాని
  • యోగా ద్వారా అనేక ఇబ్బందులను అధిగమించగల్గుతాం: ప్రధాని
  • యోగా ద్వారా శాంతి, సహనశక్తి పెంపొందుతాయి: ప్రధాని
  • యోగా ద్వారా మనోధైర్యం, ఉల్లాసం పెంపొందుతాయి: ప్రధాని

06:38 June 21

  • Yoga is a medium that establishes harmony between body and mind, action and thought & between man and nature. Modi ji's efforts led to global acceptance of Yoga,which is a precious gift of Indian culture to the entire humanity: Union Home Minister Amit Shah #InternationalYogaDay pic.twitter.com/G8mIts1RsX

    — ANI (@ANI) June 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

యోగాతో మనిషికి, ప్రకృతికి మధ్య సాన్నిహిత్యం

మానవ జీవన విధానంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు హోంమంత్రి అమిత్​షా. యోగా ద్వారా శరీరానికి- మనస్సుకు, ఆలోచనలు- క్రియలకు, మనిషికి- ప్రకృతికి మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుందని చెప్పారు. మోదీ చేసిన కృషితోనే యోగాకు ప్రపంచదేశాల అంగీకారం లభించిందన్నారు. భారత సంస్కృతి ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి యోగా అని పేర్కొన్నారు.   

06:15 June 21

  • Yoga promotes principles of peace,rights&wellbeing that UN is working towards.Celebrating #InternationalYogaDay,we're sending message of unity&connection,one that is of substantial value at time of great challenges but also great opportunities for multilateralism: DG of UN Geneva pic.twitter.com/EdPwMtW6pA

    — ANI (@ANI) June 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'శాంతి, శ్రేయస్కర జీవన సూత్రాలకు యోగా ద్వారా ప్రచారం'

శాంతి, శ్రేయస్కర జీవన సూత్రాలకు యోగా ప్రచారం కల్పిస్తుందని ప్రకటించింది ఐరాస. ప్రపంచం అత్యంత సమస్యలను ఎదుర్కొంటున్న వేళ దేశాల మధ్య సంబంధానికి యోగా ఎంతో ఉపకరిస్తుందని స్పష్టం చేసింది. 

05:51 June 21

కరోనా వారియర్స్​కు కృతజ్ఞతగా.. 108 సూర్య నమస్కారాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుజరాత్​ వడోదర లోని యోగా నికేతన్​.. వర్చవల్​గా యోగా​ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా 15 దేశాలకు చెందిన పలువురు పాల్గొని కొవిడ్​-19పై ముందుడి పోరాటం చేస్తోన్న వారికి కృతజ్ఞతగా 108 సూర్య నమస్కారాలు చేశారు. 

05:46 June 21

హరిద్వార్​లో బాబా రాందేవ్ 'యోగా'సనాలు​

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో పతాంజలి యోగ్​పీత్​ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యోగ్​పీత్​ వేదికపై బాబా రాందేవ్​ యోగాసనాలు వేశారు. కరోనా నేపథ్యంలో చాలా తక్కవ సంఖ్యలో, భౌతిక ధూరం పాటిస్తూ పలువురు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.  

05:30 June 21

యోగా డే: ఈసారి సందడంతా నెట్టింట్లోనే!

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి అంతర్జాతీయ యోగా డే వేడుకలను పూర్తిగా డిజిటల్​ ప్లాట్​ఫాంలలోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 2015 జూన్​ 21 నుంచి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న యోగా దినోత్సవాన్ని ఈసారి ఇంట్లో కుటుంబ సభ్యులతోనే జరుపుకోవాలని ఇప్పటికే స్పష్టం చేసింది ఆయూష్​ మంత్రిత్వ శాఖ. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే 'యోగా ఎట్ హోం అండ్ యోగా విత్​ ఫ్యామిలీ' వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.

యోగా డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం హైలైట్​ కానుంది. ఇంట్లోనే వేడుకలు జరుపుకోవాలని ఆయన ఇప్పటికే సందేశమిచ్చారు.

యోగా డే ముఖ్యాంశాలు..

  • ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 6:30 గంటలకు ప్రసంగిస్తారు.
  • ప్రసంగం అనంతరం 45 నిమిషాల పాటు యోగా సాధన కార్యక్రమంలో పాల్గొంటారు.
  • 2015 నుంచి ఏటా జూన్​ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
  • లేహ్​లో ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్రం భావించినప్పటికీ కరోనా కారణంగా రద్దయింది.
  • విదేశాల్లోని భారతీయ సంఘాలు యోగా డేను డిజిటల్, ఎలక్ట్రానిక్​ మీడియా వేదికగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
  • 2014 డిసెంబరు 11న యోగా డేను అధికారికంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి జనరల్​ అసెంబ్లీ. మోదీ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది

యోగాపై అవగాహన పెంచేందుకు పోటీలు..

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే యోగాపై అవగాహన పెంచేందుకు 'మై లైఫ్​- మై యోగా' వీడియో బ్లాగింగ్ పోటీలను మోదీ చేతుల మీదుగా మే 31న ప్రారంభించింది భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని యోగా ద్వారా పెంచుకోవచ్చని తెలిపింది.

ఈ పోటీలను భారత్​లో, అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. ఒక్కో దేశంలో నిర్వహించిన పోటీ నుంచి ఒక్కో విజేతను ఎంపిక చేస్తారు. వారంతా అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనాలి.

3 నిమిషాలు 3 ఆసనాలు

పోటీలో పాల్గొనేవారు 3 యోగాసనాలతో 3 నిమిషాల నిడివి గల వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలి. #MyLifeMyYogaINDIA హ్యాష్​ట్యాగ్ జత చేయాలి. యోగా ద్వారా తమ జీవితంలో వచ్చిన మార్పుపై సందేశమివ్వాలి.

యువత, పెద్దలు, యోగా వృత్తిలో ఉన్నవారికి మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలకు 2500డాలర్లు, 1500డాలర్లు, 1000డాలర్లతో పాటు ట్రోఫీని బహుమతిగా ఇస్తారు.

భారత్​లో మొత్తం ఆరు విభాగాల్లో యోగా పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా రూ.లక్ష, రూ.50వేలు, రూ.25వేలు అందజేస్తారు . ఆదివారంతో పోటీదారులకు ఇచ్చిన గడువు ముగుస్తుంది. విజేతల పేర్లను జ్యూరీ ప్రకటిస్తుంది.

Last Updated : Jun 21, 2020, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.