మధ్యప్రదేశ్లోని భోపాల్ పోలీసులకు ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేకింగ్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన వైద్య పరీక్షల ఫలితాలు నివ్వెరపరిచాయి. 50 శాతం మంది పోలీసులు మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నారని... 70 శాతం మంది ఒత్తిడికి లోనవుతున్నట్లు పరీక్షల్లో తేలింది.
ఫిట్ ఇండియా, ఫిట్ పోలీస్ ప్రచారంలో భాగంగా భోపాల్లో వైద్య శిబిరాన్ని నిర్వహించింది సంస్థ. ఇందులో 200 మందికి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 15 మంది మహిళా పోలీసులు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిసింది.
ఇటీవల ఆరోగ్య భారతావని నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని దిల్లీలో ఫిట్‌ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ.
ఇదీ చూడండి:దేశంలో కొత్త విద్యా విధానానికి కసరత్తులు..!