ETV Bharat / bharat

ఎన్నికల రణక్షేత్రంలో 'బిహార్​ కా షేర్' ఎవరు?

బిహార్‌ శాసనసభ ఎన్నికల నగారా మోగిన వేళ.. అక్కడి రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న పార్టీలు వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో పాటు.. రాష్ట్ర అభివృద్ధి, రైతుల ఆందోళనలు ప్రచారాంశాలు కానున్నాయి.

bihar elections
బిహార్​ సమరం: పార్టీల గెలుపు అస్త్రాలు
author img

By

Published : Sep 26, 2020, 5:35 PM IST

అవకాశవాద రాజకీయాలకు బిహార్​ సరైన వేదిక అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. 2020 శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్​ విడుదలైన వేళ... అన్ని పార్టీలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. బిహార్​ కా షేర్​ అనిపించుకునేందుకు పార్టీలన్నీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఎన్​డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఆందోళనల సెగ తగిలిన నేపథ్యంలో.. ప్రతిపక్షాలు ఈ పోరాటాన్ని బిహార్​ ఎన్నికల్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

నితీశ్​.. నజర్​

అన్ని పార్టీలు రణక్షేత్రంలో పోరాడేందుకు తమ వ్యూహాలకు తుదిమెరుగులు దిద్దుతున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, అధికార జేడీయూ అధినేత నితీశ్​ కుమార్ పార్టీకి అన్నితానై వ్యవహరిస్తున్నారు. పట్నాలోని పార్టీ ఆఫీసులోనే మకాం వేసిన ఆయన.. ఎన్నికల వ్యూహాలపై పార్టీనేతలతో మంతనాలు జరుపుతున్నారు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వింటున్నారు. ఎన్నికలకు ముందు వారికి మరింత దగ్గరయ్యే ఆలోచనలు చేస్తున్నారు.

జేడీయూ మిత్రపక్షం భాజపా సైతం నితీశ్​ ఆలోచనలకు అనుగుణంగానే ముందుకెళ్తోంది. ఎన్​డీఏ కార్యకర్తలంతా నితీశ్​ కుమార్​ ఆదేశాల మేరకే పనిచేయనున్నారు.

ఇదీ చూడండి: బిహార్​ పోరు: నితీశ్​ 'లిక్కర్'​ అస్త్రం ఫలించేనా?

ఆర్జేడీ.. అస్త్రాలు

మరోవైపు ప్రతిపక్షం ఆర్జేడీ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ పనితీరు ఎండగట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై ఆందోళనలకు పిలుపునిచ్చింది. బిహార్​ వ్యాప్తంగా రైతులను సంఘటితం చేసి పోరాటంలో భాగం చేయాలని భావిస్తోంది.

ఇదీ చూడండి: బిహార్​ పోరు: 'హస్తం' రేఖలు ఈసారైనా మారేనా?

మారుతున్న సమీకరణలు

అయితే, ఆర్జేడీకి అన్నీ అనుకున్నట్లుగా జరగట్లేదు. మాజీ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంజీ మహాకూటమిని వీడటం ఇబ్బందులు సృష్టిస్తోంది. అంతలోనే, ఉపేంద్ర కుష్వాహ సైతం మహకూటమి నుంచి తప్పుకుంటున్నట్లు సూచనలిస్తున్నారు. ఆర్‌ఎల్‌ఎస్పీ త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

మరోవైపు బిహార్​ రాజకీయ ప్రవేశం కోసం.. స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించిన బిహార్​ డీజీపీ గుప్తేశ్వర్​ పాండే ఎన్​డీఏలో చేరే అవకాశం ఉంది. ఇలా ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.

ఇప్పటికే చాలామంది ప్రముఖులు వివిధ పార్టీల ద్వారా రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. టికెట్ దక్కించుకుని బిహార్ బరిలో నిలవటమే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండటం.. రాజకీయ వేడి మరింత పెంచుతోంది.

ఇదీ చూడండి: బిహార్​లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే..

ఇదీ చూడండి: బిహార్​ ఎన్నికల ఫైట్​​: ఎవరి సత్తా ఎంత..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.