రాజస్థాన్ ధోల్పూర్ జిల్లాలో లోక్ అదాలత్ చొరవతో.. విడిపోయిన పది జంటలు మళ్లీ కలిశాయి. జిల్లా న్యాయసేవా ప్రాధికారసంస్థ వారి సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ కోర్టులో.. న్యాయమూర్తి వారి మధ్య రాజీ కుదిర్చారు. అనంతరం దంపతులు పరస్పరం పూలదండలు మార్చుకొని ఒక్కటయ్యారు.
ధోల్పూర్ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్లో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించారు. ఈ క్రమంలో గొడవల కారణంగా విడిపోయిన 10జంటలు సహా ఇతర 6కేసుల్లో కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చారు న్యాయమూర్తి. కలహాల కారణంగా చాలాకాలం దూరంగా ఉన్న దంపతులు కలుసుకోగా.. వారి ఆనందానికి అవధుల్లేవు.
భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని...
రాజీపడి ఏకమైన పది జంటల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని ఆశీర్వదించిన న్యాయమూర్తి.. మళ్లీ వారికి కుటుంబ బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలో ఆ జంటలు స్వీట్లు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.
"జిల్లా న్యాయ సేవా ప్రాధికారసంస్థ వారి సౌజన్యంతో లోక్ అదాలత్లో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాం. కక్షిదారుల మధ్య రాజీ కుదుర్చగలిగాం."
- న్యాయమూర్తి, లోక్ అదాలత్
ఇదీ చదవండి: 'తైపూసం' ఉత్సవంపై కనిపించని కరోనా ప్రభావం