మలేసియాలో జరిగిన 'తైపూసం హిందూ వార్షికోత్సవాల'కు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ దేశంలో ఇప్పటి వరకు 15మందికి సోకగా.. ఆ ప్రభావం ఉత్సవాలపై ఏ మాత్రం కనిపించలేదు. శిలంగూర్ రాష్ట్రం సున్నపురాతి కొండమీద బటు గుహల ఆలయంలో జరిగిన ఈ వేడుకలకు వేలసంఖ్యలో మలేసియన్ హిందువులు హాజరయ్యారు.
272 మెట్లెక్కి ఆలయంలోకి...
ఈ ఉత్సవాలకు సుమారుగా పదిహేను లక్షల మంది హాజరవుతారని ఆలయ కమిటీ అంచనా వేసింది. అయితే శుక్రవారం రాత్రి నుంచి వారి అంచనాలు మరింత పెరిగాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు 272 మెట్ల మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ కమిటీ చర్యలు భేష్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో... ఈ ప్రసిద్ధ తీర్థయాత్రలో ముందు జాగ్రత్తగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఆలయ నిర్వాహకులు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ప్రత్యేక మాస్క్‌లు ధరించాలని సందర్శకులకు సూచించారు.
"ఆలయ నిర్వాహకులు భక్తుల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు అభినందనీయం. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా మాస్క్‌లను అందిస్తున్నారు. అత్యవసర వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు."
- నోర్జాటి ఐజత్, పర్యటకురాలు
ఇదీ చదవండి: యూఏఈలో భారతీయుడి 'ఫిట్నెస్ పరుగు'