కర్ణాటక బెంగళూరు నడిబొడ్డులో మరో ప్రమాదం జరిగింది. మెట్రో సమీపంలోని జాన్సన్ రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. రోడ్డు మధ్యలో 2 అడుగుల గుంత ఏర్పడింది. ఈ గుంతలో పడి ఓ ప్రయాణికుడికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎప్పటి లాగే వాహనాలు వెళ్తుండగా ఈ గుంత ఏర్పడినట్లు వాహనదారులు చెబుతున్నారు. అండర్ గ్రౌండ్ మెట్రో పనులు జరుగుతున్న కారణంగానే మట్టి లూజ్ అయి ఈ గుంత ఏర్పడినట్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ గుంతలో పడి ఓ వ్యక్తి గాయపడటం వల్ల.. ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. గుంత చట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ గుంత ఏర్పడ్డ రోడ్డు కొంత భాగం బ్లాక్ చేశారు. సమాచారం అందుకున్న బెంగళూరు వెస్ట్ డివిజన్ డీసీపీ కాలా కృష్ణమూర్తి ఘటనా స్థలానికి చేసుకున్నారు. రోడ్డులో గుంత ఏర్పడటంపై దర్యాప్తు ప్రారంభించారు. అకస్మాత్తుగా ఏర్పడిన గుంత కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్‌ను అదుపు చేయాడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
మెట్రో పిల్లర్ కూలి తల్లీకుమారుడు మృతి..
ఇటీవల బెంగళూరులో మెట్రో సమీపంలో ఓ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి.. తేజశ్విని(28), కుమారుడు విహాన్(2) మరణించారు. తండ్రి లోహిత్ కుమార్, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గోవింద్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగవరా ప్రాంతంలో రాత్రి 9.30 గంటలకు జరిగింగి. పుర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.