ETV Bharat / bharat

భళా అనిపించే మీగడ బొమ్మలు - India Book of Records

పాలపై మీగడ కనిపిస్తే మీరైతే ఏం చేస్తారు? చకచక తీసి నోట్లో వేసుకుని వహ్వా.. అని అంటారు. కానీ బంగాల్​కు చెందిన ఓ అమ్మాయి మాత్రం మీగడ కనిపిస్తే చాలు దేశభక్తిని ప్రదర్శిస్తూ.. నిమిషాల్లో స్వాతంత్య్ర సమరయోధుల బొమ్మలు ఆసువుగా వేసేస్తోంది.

Bengal girl attempts India Book of Records for painting on milk cream
భళా అనిపించే 'మీగడ' బొమ్మలు
author img

By

Published : Nov 23, 2020, 10:54 AM IST

Updated : Nov 23, 2020, 1:49 PM IST

భళా అనిపించే మీగడ బొమ్మలు

పాల మీగడపై బొమ్మలు వేస్తూ ఔరా! అనిపిస్తోంది బంగాల్​ బలుర్​ఘాట్​కు చెందిన 18ఏళ్ల జాన్వీ బసక్. కుంచె పట్టుకుని స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను మాగీ చేసినంత ఈజీగా వేసేస్తోంది. ఎంతో సున్నితమైన మీగడపై కదలకుండా కళాఖండాలు చెక్కడం అంత సులువు కాదు. కానీ ఈ యువతి మాత్రం చాలా ఏకాగ్రతతో బొమ్మలు వేస్తూ పలువురితో భళా! బాలిక అని అనిపించుకుంటుంది. ఈ యువతి ప్రతిభకు ఇండియా బుక్​ ఆఫ్​ రికార్ట్స్​లో స్థానం దక్కింది.

Bengal girl attempts India Book of Records for painting on milk cream
స్వాతంత్ర్యసమరయోధుల బొమ్మలు

ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డుల్లో చోటు...

మీగడపై బొమ్మలు వేసి అందరిని అబ్బురపరిచిన జాన్వీకి ఇండియా బుక్​ ఆఫ్​ రికాప చోటు దక్కింది. వేరు వేరు పాత్రల్లో తీసుకున్న పాలపై ఉన్న మీగడపై ఝాన్సీ లక్ష్మీబాయి, బాలగంగాధర తిలక్​ వంటివారి ఎనిమిది బొమ్మలు వేశారు. ఇందుకుగాను జాన్వీకి ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డుల్లో స్థానం దక్కింది. చిత్రాలు వేసేప్పుడు తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

లక్ష్మీబాయి

బాలగంగాధర్​ తిలక్​

కరోనా మంచే చేసింది...

అందరి జీవితాల్లో కరోనా ప్రభావం ఉంది అనడం అతిశయోక్తి కాదు. అది మంచా? చెడా? అనేది తరువాత. కానీ జాన్వీకి మాత్రం కరోనా మంచే చేసింది. లాక్​డౌన్​ సమయంలో విద్యాసంస్థ మూతపడడం కారణంగా ఇంటికే పరిమితమైంది. ఆ సమయాన్ని తనకు ఎంతో ఇష్టమైన చిత్రలేఖనానికి ఉపయోగించింది.

ఒకరోజు అమ్మ తాగమని పాలు ఇచ్చింది. నేను మర్చిపోయాను. పాలు చల్లారిపోయాయి. దానిపై మీగడ చూశాను. నాకు ఇష్టమైన చిత్రలేఖనాన్ని పేపరుపై నుంచి పాలమీగడపైకి తీసుకురావాలి అని అనుకున్నాను. మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. కానీ నిరుత్సాహపడలేదు. లాక్​డౌన్​ సమయంలో సాధన చేశాను. దేశనాయకులు బొమ్మలు వేయగలిగాను. ఇలా ఓ రోజు ఒకేసారి ఎనిమిది పాత్రల్లో వేశాను. ఆ ప్రయత్నమే నాకు ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డులో స్థానం కల్పించింది. దీని వెనక నా కృషితో పాటు అమ్మా,నాన్నల ప్రోత్సాహం ఎంతో ఉంది. భవిష్యత్తుల్లో మరిన్ని బొమ్మలు వేస్తాను. రకరకాలు వాటిపై వేయడానికి ప్రయత్నిస్తాను.

-జాన్వీ

ఇదీ చదవండి:బిజినెస్​ స్కూళ్లలో పాఠ్యాంశంగా బయోటాయిలెట్లు

Last Updated : Nov 23, 2020, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.