ETV Bharat / bharat

'రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కానీ ఎంపీగా ఉంటా' - కేంద్ర మంత్రి మండలి విస్తరణ బాబుల్ సుప్రియో

రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించిన భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో పార్లమెంటు సభ్యుడిగా కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం ఈ మేరకు వ్యాఖ్యానించారు.

babul supriyo
బాబుల్‌ సుప్రియో
author img

By

Published : Aug 3, 2021, 5:19 AM IST

రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడంతో పాటు ఎంపీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్టు ఇటీవల సంచలన ప్రకటన చేసిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో తన నిర్ణయం మార్చుకున్నారు. ప్రస్తుతం బంగాల్​లోని అసన్సోల్ నుంచి భాజపా ఎంపీగా ఉన్న ఆయన.. రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తిస్తానని ప్రకటించారు. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగుతున్నా. అయితే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షుడు నడ్డా సూచనల మేరకు ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నా. నా రాజ్యాంగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా. దిల్లీలో నాకు కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నా."

-బాబుల్ సుప్రియో

క్రియాశీల రాజకీయాల్లో కొనసాగలేనని ప్రకటించిన సుప్రియోను ఎట్టకేలకు లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా భాజపా ఒప్పించగలిగింది. అయితే.. కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సుప్రియో పదవి కోల్పోయారు. దీనితో అసంతృప్తి చెందిన ఆయన రాజకీయాలకు గుడ్‌ బై చెబుతున్నట్టు వార్తలొచ్చాయి.

బంగాల్​లో పార్టీకార్యకలాపాలపై తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నట్లు సుప్రియో తెలిపారు. తాను ఏం మాట్లాడినా భాజపా ప్రయోజనాల కోసమేనని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.