ETV Bharat / bharat

అయోధ్య రామాలయ గర్భగుడిలో ఇద్దరు బాల రాముళ్లు- కొత్త విగ్రహం తయారు చేసింది ఆయనే!

Ayodhya Ram Mandir Statue Finalized : అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించే విగ్రహాన్ని ఖరారు​ చేసినట్లు ఆలయ ట్రస్ట్ ప్రధాన​ కార్యదర్శి చంపత్​ రాయ్ వెల్లడించారు. ఇంతకీ బాల రాముడి విగ్రహం చెక్కిన శిల్పి ఎవరంటే?

Etv Ayodhya Ram Mandir Statue Finalized
Ayodhya Ram Mandir Statue Finalized
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 4:42 PM IST

Updated : Jan 15, 2024, 5:47 PM IST

Ayodhya Ram Mandir Statue Finalized : అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించడానికి మైసూరుకు చెందిన శిల్పి అరుణ్​ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్ సోమవారం తెలిపారు. 150 నుంచి 200 కిలోల వరకు బరువున్న కొత్త విగ్రహాన్ని జనవరి 18న గర్భగుడిలోకి చేర్చుతామని అన్నారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని చెప్పారు. గర్భగుడిలో పాత విగ్రహంతో పాటు కొత్త విగ్రహం కూడా ఉంటుందని వెల్లడించారు. జనవరి 16న (మంగళవారం) ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు మొదలవుతాయని తెలిపారు.

  • कर्नाटक के प्रसिद्ध मूर्तिकार श्री अरुण योगीराज द्वारा कृष्णशिला पर निर्मित मूर्ति का चयन भगवान श्री रामलला सरकार के श्री विग्रह के रूप में प्रतिष्ठित होने हेतु किया गया है।

    The Murti sculpted on Krishna Shila, by renowned sculptor Shri Arun Yogiraj, has been selected as Shri…

    — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రాణప్రతిష్ఠ ముహూర్తం వారణాసికి చెందిన గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ నిర్ణయించారు. ఆయన పర్యవేక్షణలో 121 మంది ఆచార్యాలు సమక్షంలో ప్రాణప్రతిష్ఠకు ముందు నిర్వహించే కార్యక్రమాలు జరగుతాయి. కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా ఉంటారు. జనవరి 20, 21 తేదీల్లో భక్తులు దర్శించుకునేందుకు అనుమతి లేదు. జనవరి 22న ఒంటిగంటకల్లా ప్రాణప్రతిష్ఠ పూర్తి అవుతుంది. ఆ తర్వాతి రోజు నుంచి గర్భగుడిలోకి భక్తులను అనుమతిస్తారు"
-- చంపత్ రాయ్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి

ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్​ఎస్​ఎస్​ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్య నాథ్‌ ఇతర ప్రముఖుల సమక్షంలో రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. భారత్​లోని 150పైగా హిందూ సంప్రదాయాలకు చెందిన ఆచార్యులు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 50పైగా గిరిజన సంప్రదాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు చెప్పారు.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ దేశవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొందని చంపత్ రాయ్ అన్నారు. ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు నీళ్లు, మట్టి, బంగారం, వెండి, వజ్రాలు, వస్త్రాలు, గంటలు, ఢమరుకాలు, సువాసన వెదజల్లే వస్తువులు వంటి కానుకలు తెస్తున్నారని అన్నారు.

  • #WATCH |" Inside Ram temple's 'Garbh Griha', PM Modi, RSS chief, UP CM, Nritya Gopal ji Maharaj, UP Governor and all temple trustees will remian present. Over 150 saints, experts from different fields and Padma awardees have also been invited to the program," says Champat Rai,… pic.twitter.com/ELv6h6zH4d

    — ANI (@ANI) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | Champat Rai, General Secretary of Shri Ram Janmabhoomi Teerth Kshetra trust says, "The 'Pran Prathishtha' is expected to conclude by 1pm. PM and others present on the occasion will express their thoughts after the ceremony. As per tradition, gifts in 1000 baskets have… pic.twitter.com/zBOaNNtJwK

ఎవరీ అరుణ్​ యోగిరాజ్?
బాలరాముడి విగ్రహాన్ని రూపొందించిన అరుణ్ యోగిరాజ్ కర్ణాటకలోని మైసూరుకు చెందిన వ్యక్తి. ఆయన కుటుంబం ఐదు తరాలుగా శిల్పాకళా రంగంలో ఉంది. అరుణ్​ తన తండ్రి యోగిరాజ్, తాత బసవన్న శిల్పిని చూసి ప్రభావితుడయ్యారు. చిన్నప్పటి నుంచే శిల్పకళపై మక్కువ పెంచుకున్నారు. ఎంబీఏ చదివి ఓ కార్పొరేట్ సంస్థలో పని చేసినా శిల్పకళపై ఆసక్తితో మళ్లీ వెనుదిరిగారు. 2008 నుంచి తన పూర్తి సమయాన్ని శిల్పకళకు కేటాయించి అద్భుతమైన శిల్పాలు రూపొందించడంలో ప్రావీణ్యం సంపాదించారు. తద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అరుణ్​ చెక్కిన శిల్పాలలో ఇండియా గేట్​ సమీపంలోని సుభాశ్​ చంద్రబోస్​ విగ్రహం, కేదార్​నాథ్​లోని ఆదిశంకరాచార్య విగ్రహం ఉన్నాయి.

అయోధ్య అరుదైన ఘనత- అతిపెద్ద 'సోలార్​ స్ట్రీట్'​తో గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్

రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు 55 దేశాల అతిథులు- అక్కడి నుంచే మోదీ ప్రసంగం

Last Updated : Jan 15, 2024, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.