ETV Bharat / bharat

ఆ రాష్ట్రాలకు వెళ్తే.. ఈ ఆంక్షలు పాటించాల్సిందే!

కరోనా ఉద్ధృతి తారస్థాయికి చేరిన నేపథ్యంలో అంతర్​రాష్ట్ర ప్రయాణికులపై పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆర్​టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినవారినే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నాయి. ఆరోగ్య సేతు యాప్​ను సైతం తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రయాణికులపై ఏ రాష్ట్రాల్లో ఏఏ ఆంక్షలు అమలవుతున్నాయో తెలిపే వివరాలు మీకోసం.

As cases surge across country, states tighten travel rules
ప్రయాణికులపై ఏ రాష్ట్రాల్లో ఏఏ ఆంక్షలంటే?
author img

By

Published : Apr 18, 2021, 4:26 PM IST

దేశంలో కరోనా కేసులు భయంకర రీతిలో పెరిగిపోతున్నాయి. కొత్తగా రెండు లక్షల 61 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 18 లక్షలకు చేరింది. ఈ స్థాయిలో కరోనా ఉద్ధృతి సాగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి. అంతర్​రాష్ట్ర ప్రయాణాలు సాగించేవారికి నిబంధనలు అమలు చేస్తున్నాయి.

దేశ రాజధానిలో

కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీ చేరుకున్న ప్రయాణికులు ఏడు రోజులు క్వారంటైన్​లో ఉండాలనే నిబంధన విధించింది. ఎయిర్​పోర్ట్​లలో ర్యాండమ్​గా పరీక్షలు నిర్వహిస్తోంది. పాజిటివ్​గా తేలితే.. హోంక్వారంటైన్ లేదా ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తోంది.

యూపీ

మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్​టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేసింది ఉత్తర్​ప్రదేశ్ సర్కార్. ఆర్​టీపీసీఆర్ పరీక్ష 72 గంటల లోపు చేసినదై ఉండాలి. వారం కన్నా ఎక్కువ కాలం రాష్ట్రంలో ఉండాలనుకునేవారికి 14 రోజుల హోంక్వారంటైన్ తప్పనిసరి చేసింది.

అసోం

అసోం వైద్య శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఎయిర్​పోర్టుల్లో వచ్చే ప్రతి ఒక్కరు ఆర్​టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. విమానాశ్రయంలోనే కరోనా పరీక్షలకు నమూనాలు ఇవ్వాలి. ఫలితాలు వచ్చేంత వరకు క్వారంటైన్​లో ఉండాలి. ముంబయి, బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణికులు 72 గంటల్లోపు చేసిన ఆర్​టీపీసీఆర్ కరోనా పరీక్ష నెగెటివ్ పత్రాన్ని తప్పనిసరిగా వెంటతెచ్చుకోవాలి.

ఉత్తరాఖండ్

కరోనా ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల ప్రయాణికులకు ఆర్​టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరి చేసింది ఉత్తరాఖండ్. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, హరియాణా, యూపీ, దిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలను కరోనా ముప్పు అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో చేర్చింది. రోడ్డు, రైలు, వాయు మార్గం గుండా ఈ రాష్ట్రాల నుంచి వచ్చేవారు కరోనా నెగెటివ్ పత్రం తప్పక చూపించాలి.

చండీగఢ్

పంజాబ్, హరియాణా రాష్ట్రాల రాజధాని, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్​కు వెళ్లాలనుకునే ప్రయాణికులు పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన కోవా యాప్​లో రిజిస్టర్ అవ్వాలి. నగరానికి వెళ్లిన తర్వాత.. ఓ డిక్లరేషన్​ను నింపాలి. థర్మల్ స్క్రీనింగ్​కు సహకరించాలి.

రాజస్థాన్​

రాష్ట్రంలోకి వచ్చేవారితో పాటు రాష్ట్రం నుంచి బయటకు వెళ్లేవారికీ కరోనా పరీక్షలను తప్పనిసరి చేసింది రాజస్థాన్ ప్రభుత్వం. ఏ రాష్ట్రం నుంచి వచ్చేవారైనా ఆర్​టీపీసీఆర్ తప్పనిసరిగా చేయించుకోవాలని స్పష్టం చేసింది.

గుజరాత్

గుజరాత్​కు వెళ్లాలనుకునే పక్కరాష్ట్రాల ప్రయాణికులు తమ వెంట ఆర్​టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరిగా తీసుకురావాలి. లేదంటే ఎయిర్​పోర్టుకు రాగానే కరోనా టెస్టు చేయించుకోవాలి. ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులను అక్కడే ఉంచుతారు. సూరత్​కు వెళ్లాలనుకునే ప్రయాణికులు ఎస్​ఎంసీ కొవిడ్ ట్రాకర్ యాప్​ను డౌన్​లోడ్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ ఫాంను నింపాల్సి ఉంటుంది.

మధ్యప్రదేశ్

మహారాష్ట్ర నుంచి ఇందోర్, భోపాల్​కు వచ్చే ప్రయాణికులకు నెగెటివ్ ఆర్​టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరి చేసింది మధ్యప్రదేశ్. ఈ రిపోర్టు 48 గంటల్లోనిదై ఉండాలి. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చే వారిపై ఎలాంటి ఆంక్షలు లేవు.

కర్ణాటక

72 గంటలలో ఆర్​టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే కర్ణాటకలోకి అనుమతిస్తారు. ఈ నిబంధన చండీగఢ్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులకు వర్తిస్తుంది.

కేరళ

కేరళకు వెళ్లే ముందు ప్రయాణికులు.. ఆ రాష్ట్ర కొవిడ్ పోర్టల్​లో తమ పేరు నమోదు చేసుకొని ఈ పాస్​ను పొందాల్సి ఉంటుంది. ఫోన్​లో ఆరోగ్య సేతు యాప్ ఉండటం తప్పనిసరి. కరోనా లక్షణాలు ఉన్న ప్రయాణికులు కేరళలో అడుగుపెట్టగానే ఆర్​టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. అయితే, వ్యాపారాలు, కోర్టు కేసులు, చికిత్స కోసం వచ్చేవారికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి రాగానే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్​ నిర్వహిస్తారు. స్పందన వెబ్​సైట్ సహా ఆరోగ్య సేతు యాప్​లో పేరు నమోదు చేసుకోవడం తప్పనిసరి.

ఇదీ చదవండి: కవచాన్ని కరగనీయొద్దు- వైరస్​పై పోరులో ఇదే కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.