ETV Bharat / bharat

కేజ్రీవాల్​కు నాలుగో సారి ఈడీ సమన్లు- 18న విచారణకు రావాలని ఆదేశాలు - మద్యం కేసులో కేజ్రీకి ఈడీ సమన్లు

Arvind Kejriwal ED Summons : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నాలుగో సారి సమన్లు జారీ చేసింది. దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి జనవరి 18న విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది.

Arvind Kejriwal ED Summons
Arvind Kejriwal ED Summons
author img

By PTI

Published : Jan 13, 2024, 9:42 AM IST

Updated : Jan 13, 2024, 10:40 AM IST

Arvind Kejriwal ED Summons : ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్​, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి జనవరి 18న విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. కేజ్రీవాల్‌కు ఇప్పటికే మూడుసార్లు ఈడీ సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో తమ ఎదుట హాజరు కావాలని దర్యాప్తు సంస్థ నాలుగోసారి ఆయనకు శనివారం ఆదేశాలు జారీ చేసింది.

అంతకుముందు జనవరి 3న మూడోసారి సమన్లు జారీ చేయగా వీటిని అక్రమమని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఆ సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవిగా ఆరోపించారు. 'బీజేపీ సూచన మేరకే ఈడీ సమన్లు పంపింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నన్ను దూరం చేసేందుకు వీటిని జారీ చేశారు. తక్షణమే సమన్లను ఉపసంహరించుకోవాలి' అని కేజ్రీవాల్ డిమాండ్‌ చేశారు.

కేజ్రీవాల్​పై బీజేపీ ఫైర్
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు ఈడీ నాలుగో సారి సమన్లు జారీ చేయడంపై దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్​దేవా స్పందించారు. 'అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి భయపడుతున్నారు. అందుకే ఈడీ విచారణకు హాజరుకావట్లేదు' అని వీరేంద్ర సచ్​దేవా తెలిపారు. మరోవైపు, అరవింద్ కేజ్రీవాల్​ ఈడీ విచారణను తప్పించుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అని అన్నారు బీజేపీ నేత బన్సూరి స్వరాజ్​. ' గతేడాది నవంబర్ నుంచి ఈడీ కేజ్రీవాల్​కు పలుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్​ ఎప్పుడూ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, విపాసన కోసం వెళుతున్నానని సాకులు చెబుతూనే ఉన్నారు. కేజ్రీవాల్ నిజాయితీగా ఉంటే ఈడీ విచారణకు హాజరుకావాలి. చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి.' బన్సూరి స్వరాజ్ తెలిపారు.

  • VIDEO | "It is very shameful that Arvind Kejriwal is trying to evade ED summon. From November last year, the ED has issued multiple summons to him. However, he has always made excuses, saying he is busy with election campaigning or going for Vipassana," says BJP leader… pic.twitter.com/m2GKTxjBpa

    — Press Trust of India (@PTI_News) January 13, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇప్పటికే ఇద్దరు కీలక నేతలు అరెస్ట్​
దిల్లీ మద్యం కేసుకు సంబంధించి నమోదు చేసిన ఛార్జ్​షీట్లలో సీఎం కేజ్రీవాల్ పేరును అనేకసార్లు ప్రస్తావించింది ఈడీ. ఈ కేసులో నిందితులు కేజ్రీవాల్​తో నిరంతరం టచ్​లో ఉన్నారని చెప్పింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ తయారీ నుంచి అమలు వరకు వివిధ అంశాలపై వీరు ఆప్ అధినేతతో సంప్రదింపులు సాగించారని ఈడీ ఆరోపించింది. అయితే, దీనిపై సీబీఐ సైతం విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటికే దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, ఎంపీ సంజయ్​ సింగ్​ను అరెస్ట్ చేసింది.

బీజేపీ చెప్తేనే ఈడీ నోటీసులు పంపిందన్న కేజ్రీవాల్​, లిక్కర్​ స్కామ్​ విచారణకు డుమ్మా!

'ఆ పని కోసం విధి మోదీని ఎంచుకుంది'- రామాలయ నిర్మాణంపై అడ్వాణీ వ్యాసం

Last Updated : Jan 13, 2024, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.