ETV Bharat / bharat

రాజకీయాల కోసం వాళ్లు ఏవేవో మాట్లాడతారు.. జవాబులు చెప్పాల్సిన అవసరం లేదు: మంత్రి అమర్‌నాథ్‌ - విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ

GUDIVADA AMARNATH: విశాఖ ఉక్కు పరిశ్రమ అంశంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్​ స్పందించారు. విశాఖ ఉక్కుపై తెలంగాణ నుంచి అధికారిక ప్రకటన ఏదీ ఇప్పటివరకూ రాలేదని.. ప్రకటన లేకుండా ఏం మాట్లాడగలం అని ప్రశ్నించారు.

GUDIVADA AMARNATH
GUDIVADA AMARNATH
author img

By

Published : Apr 10, 2023, 4:38 PM IST

Updated : Apr 10, 2023, 5:28 PM IST

MINISTER AMARNATH ON VIZAG STEEL PALNT: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం వ్యతిరేకం అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్​ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై వస్తున్న వార్తలపై స్పందించిన మంత్రి.. విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అన్నారు. లాభనష్టాలు చూడకుండా స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రమే నడపాలని డిమాండ్​ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని కేసీఆర్ అన్నారని అమర్‌నాథ్‌ గుర్తు చేశారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ కొనుగోలుపై తెలంగాణ నుంచి అధికారిక ప్రకటన ఏదీ ఇప్పటివరకూ రాలేదన్నారు. కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వ ప్రకటన లేకుండా ఏం మాట్లాడగలం? అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం వాళ్లు ఏవేవో మాట్లాడతారని.. రాజకీయ విమర్శలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్​ ముందుకొచ్చారు: విశాఖ స్టీల్ ప్లాంట్​ని భావితరాలకు ఇచ్చే బాధ్యత తమదే అని బీఆర్​ఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్​ హామీ ఇచ్చారు. స్టీల్​ప్లాంట్​ విషయంలో రాజకీయాల్ని అడ్డుకొని తీరతామని... ప్రైవేటీకరణ ఒక క్రూరమైన చర్య అని వ్యాఖ్యానించారు. తాను విశాఖలో చదువుతున్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఆందోళనల్ని కళ్లారా చూశానన్నారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్​ను.. కార్మికులు కష్టపడి మూడు లక్షల కోట్ల రూపాయల మేర ఆస్తులను పెంచారని.. వీటిని కబ్జా చేయడం కోసమే.. బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అదానీకి కట్టబెట్టేందుకు పావుల కదుపుతోందని విమర్శించారు.

విశాఖ స్టీల్​ ప్లాంట్​ విషయంలో మూడు స్పష్టమైన డిమాండ్లు ఉన్నట్లు తోట వెల్లడించారు.

1. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి...

2. ప్లాంటుకి గనుల కేటాయింపు జరగాలి...

3. ఐదు వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చి ఆడుకోవాలి..అలా కాని పక్షంలో నిర్వాసితుల స్థలాల్ని వెనక్కి ఇవ్వాలి.

ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు శక్తులకు అప్పగించే కుట్రకి పెట్టిన పేరే డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ అని విమర్శించారు. అదానీ బొగ్గు దిగుమతులకు స్టీల్ ప్లాంట్ భూములు కావాలని... గంగవరం పోర్టుని అదానీ దిగుమతుల కోసం ఉపయోగిస్తున్నారని... ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పైనా అదే కుతంత్రాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.

స్టీల్ ప్లాంట్ ఆస్తులే స్టీల్ ప్లాంట్​కు శ్రీరామ రక్ష అని... అందుకే నిర్వాసితులు ఇచ్చిన భూముల్ని వెనక్కి ఇచ్చేయండని డిమాండ్​ చేశారు. ఇక్కడి ప్రభుత్వం పార్టీలు చేతులెత్తేశాయని... అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకొచ్చారని తెలిపారు. కేసీఆర్ విశాఖ వస్తే అన్ని ఏర్పాట్లు చేస్తామని ఉద్యోగ సంఘాలు చెప్పినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 10, 2023, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.