ETV Bharat / bharat

అనుమానం ఉంటే ఆసుపత్రి రికార్డులు చూడండి: దేశ్​ముఖ్​ - అనిల్​ దేశ్​ముఖ్

తనపై వచ్చిన అధికార దుర్వినియోగ ఆరోపణలను మహారాష్ట్ర హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ ఖండించారు. కరోనా సోకి ఫిబ్రవరి5వ తేదీ నుంచి 15వరకు ఆసుపత్రిలో ఉన్నాని.. కావాలంటే రికార్డులు పరిశీలించాలని కోరారు.

Anil Deshmukh issues statement `to set record straight'
'కావాలంటే ఆసుపత్రి రికార్డులు చూడండి'
author img

By

Published : Mar 24, 2021, 8:14 AM IST

తాను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డానంటూ వస్తున్న ఆరోపణలు తీవ్రంగా బాధించాయని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్​దేశ్​ముఖ్​ అన్నారు. అనుమానం ఉంటే తాను ఆసుపత్రిలో ఉన్నప్పటి రికార్డులను పరిశీలించాలని కోరారు.

నెలకు వందకోట్లు సంపాదించాలని ముఖేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు కేసులో అరెస్టైన పోలీసు అధికారి సచిన్​ వాజేతో హోంమంత్రి అనిల్​దేశ్​ముఖ్​ చెప్పారంటూ ముంబయి మాజీ పోలీస్ కమిషనర్​ పరమ్​ బీర్​ సింగ్.. సీఎం ఉద్ధవ్ ఠాక్రే​కు లేఖ రాశారు. దీంతో ఈ లేఖ మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర అలజడిని సృష్టించింది. హోం మంత్రి రాజీనామా చేయాలని ప్రతి పక్ష భాజపా డిమాండ్ చేసింది.

ఈ ఆరోపణలను అనిల్​ దేశ్​ముఖ్​ ఖండించారు. కరోనాతో తాను ఫిబ్రవరి5నుంచి 15 వరకు ఆసుపత్రిలోనే ఉన్నానని.. ఆ తర్వాత డిశ్చార్జి అయి విలేకరుల సమావేశం పెట్టినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: హోంమంత్రి​ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు: పాటిల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.