ETV Bharat / bharat

ఎయిర్​ఇండియా సీన్​ రిపీట్​.. పక్కన కూర్చున్న వ్యక్తిపై మూత్ర విసర్జన - అమెరికన్​ ఎయిర్​లైన్స్​ లేటెస్ట్ న్యూస్

విమానంలో ప్రయాణికుడిపై మూత్రం పోసిన ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఓ ప్రయాణికుడు పక్కనే కూర్చున్న వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు.

american airlines urination case
american airlines urination case
author img

By

Published : Mar 5, 2023, 12:46 PM IST

ఎయిర్​ఇండియా విమానంలో మూత్రవిసర్జన ఘటన మరవకముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఓ ప్రయాణికుడు పక్కనే కూర్చున్న వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. నిందితుడు అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి అని ఓ విమానాశ్రయ అధికారి తెలిపారు. మూత్రం పోసిన సమయంలో అతడు తాగిన మైకంతో నిద్రిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, బాధితుడు మాత్రం దీన్ని పోలీసుల వరకు తీసుకెళ్లాలని భావించలేదని తెలుస్తోంది. నిందితుడు క్షమాపణలు చెప్పడం వల్ల.. ఇది వివాదంగా మారితే తన కెరీర్‌కు ముప్పని ప్రాధేయపడ్డట్లు సమాచారం. కానీ, విమాన సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని వెంటనే పైలట్‌ ద్వారా దిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ దృష్టికి తీసుకెళ్లగా.. వారు సీఐఎస్ఎఫ్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. విమానం ల్యాండ్‌ కాగానే నిందితుణ్ని సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించగా.. విచారణ చేపట్టారు.

"అమెరికా ఎయిర్​లైన్స్​కు చెందిన 292 విమానం జాన్​ ఎఫ్​ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దిల్లీకి బయలుదేరింది. అయితే ఓ ప్రయాణికుడు మద్యం అతిగా తాగి.. విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. సిబ్బంది సూచనలు చేసినా పట్టించుకోకుండా వారితో వాగ్వాదానికి దిగాడు. విమాన నిబంధనలు ఉల్లఘించి తోటి ప్రయాణికులతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. 15G నంబర్ సీట్​​లో కూర్చున్న వ్యక్తిపై మూత్రం పోశాడు."

---అమెరికన్ ఎయిర్​లైన్స్​

70 ఏళ్ల వృద్ధురాలిపై..
గతేడాది నవంబరు 26న కూడా ఇలాంటి తరహా ఘటనే జరిగింది. న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన ఎయిర్​ఇండియా విమానం బిజినెస్‌ క్లాసులో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు ఓ వ్యక్తి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత అజ్ఞాతంలో ఉన్న నిందితుడు శంకర్‌ మిశ్రాను దిల్లీ పోలీసులు అరెస్టు చేశాడు. సుమారు నెలరోజులు జైల్లో గడిపిన మిశ్రా ప్రస్తుతం బెయిల్‌పై బయటకొచ్చారు. అయితే అతడిపై నాలుగు నెలల పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించింది ఎయిర్​ఇండియా. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్. తమ ఉద్యోగులు త్వరితగతిన స్పందించాల్సిందని అభిప్రాయ పడ్డారు. అయితే నిందితుడు మిశ్రా మాత్రం వృద్ధురాలిపై తాను మూత్ర విసర్జన చేయలేదని వాదిస్తున్నాడు. ఆమే తనకు తాను మూత్ర విసర్జన చేసుకున్నారని న్యాయస్థానంలో చెప్పాడు. మిశ్రా వ్యాఖ్యలను బాధితురాలు ఖండించారు.

ఇవీ చదవండి : బిడ్డ కోసం హైనాతో పోరాటం.. 3 కి.మీ పరిగెత్తిన తల్లి.. దురదృష్టవశాత్తూ..

కోడలితో పారిపోయిన వ్యక్తి.. కొడుకు బైక్​పైనే జంప్.. తన భార్యకేం తెలీదంటున్న బాధితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.