ETV Bharat / bharat

'దేశంలోని ప్రతి ఓటర్​ను గౌరవించే పార్టీ.. కాంగ్రెస్​' - kapil sibal on rahul statements

కాంగ్రెస్ పార్టీ ప్రతి ఓటర్​ను గౌరవిస్తుందని.. ప్రాంతీయ భేదాలు లేవని సీనియర్​ కాంగ్రెస్​ నేత కపిల్ సిబల్​ తెలిపారు. ప్రజలను కాంగ్రెస్​ విడదీస్తోందని భాజపా అనటం హాస్యాస్పదం అన్నారు. కేరళలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ చేసిన ప్రసంగంపై భాజపా నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సిబల్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

Always been Congress' position to respect electors irrespective of location: Sibal
'దేశంలోని ప్రతి ఓటర్​ను గౌరవించే పార్టీ.. కాంగ్రెస్​'
author img

By

Published : Feb 25, 2021, 5:05 AM IST

ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి ఓటర్​ను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని ఆ పార్టీ సీనియర్​ నేత కపిల్ సిబల్​ అన్నారు. ప్రజలను కాంగ్రెస్​ విడదీస్తోందని భాజపా అనటం హాస్యాస్పదం అన్నారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి వారిని విడదీయటంలో భాజపా నేతలు నిష్ణాతులని ఆరోపించారు. కేరళలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ చేసిన ప్రసంగంపై భాజపా నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

" కాంగ్రెస్ నేతగా.. దేశంలోని ప్రతి ఓటర్​ను నేను గౌరవిస్తాను. వారు ఏ ప్రాంతం వారని సంబంధం లేదు. ఓటు హక్కు ద్వారా ఎన్నికల్లో వారికి నచ్చిన వారిని ఎన్నుకోవచ్చు."

-- కపిల్ సిబల్​, కాంగ్రెస్ సీనియర్​ నేత

రాహుల్​ గాంధీ.. ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో ఆయనే వివరణ ఇవ్వగలరని మరో నేత ఆనంద్ శర్మ తెలిపారు. ఏ ప్రాంతాన్నీ.. కాంగ్రెస్ అగౌరవపరచలేదని స్పష్టం చేశారు. కేరళ తిరువనంతపురంలో మంగళవారం చేసిన ప్రసంగంలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.."గత పదిహేనేళ్లుగా ఉత్తర భారతం నుంచే ఎంపీగా ఎన్నికయ్యాను. అక్కడ విభిన్నమైన రాజకీయాలకు అలవాటు పడ్డాను. కానీ కేరళకు వస్తే నా మనసు తేలికవుతుంది. ఇక్కడ ప్రజలు అనవసర అంశాలపై గాక అసలైన సమస్యల గురించి ఆలోచిస్తారు." అని అన్నారు.

ఇదీ చదవండి : ఎన్నికల వేళ.. శశికళ సంధి ప్రతిపాదన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.