ETV Bharat / bharat

'మధ్యవర్తిత్వానికి దేశ న్యాయ ముఖచిత్రాన్ని మార్చే శక్తి' - మధ్యవర్తిత్వం

Alternative Dispute Resolution: ప్రత్యామ్నాయ వివాద పరిష్కారమార్గం ఏడీఆర్​కు దేశ న్యాయపరమైన ముఖచిత్రాన్ని మార్చే సామర్థ్యం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో మీడియేషన్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో మాట్లాడారు.

Alternative dispute resolution
ఎన్​. వి. రమణ
author img

By

Published : Apr 9, 2022, 6:03 PM IST

Alternative Dispute Resolution: లక్షలాది మంది ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా ప్రత్యామ్నాయ వివాద పరిష్కారమార్గం ఏడీఆర్​కు దేశ న్యాయపరమైన ముఖచిత్రాన్ని మార్చే సామర్థ్యం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అభిప్రాయపడ్డారు. భాగస్వామ్య పక్షాల అందరి సహకారంతో భారతదేశ సామాజిక న్యాయ సాధనంగా ఏడీఆర్ రూపొందే అవకాశం ఉందని అన్నారు. ఏడీఆర్​ భావనకు లోక్‌ అదాలత్‌లు, గ్రామ న్యాయాలయాలు, మధ్యవర్తిత్వ కేంద్రాల ద్వారా దేశ న్యాయపరమైన ముఖచిత్రాన్ని మార్చే శక్తి ఉందని సీజేఐ అన్నారు.

"మధ్యవర్తిత్వం విఫలమైతే పరిణామాలు ఎలా ఉంటాయనేది మనందరికీ తెలుసు. కృష్ణ భగవానుడు విజయవంతమై ఉంటే (మధ్యవర్తిత్వంలో) ఎంత విధ్వంసం తప్పిపోయి ఉండేదో, ఎన్ని ప్రాణాలు నిలబడగలిగేవో, ఎన్ని రాజ్యాలు సుసంపన్నంగా ఉండేవో ఊహించండి. తప్పుగా అర్థం చేసుకోవడం, అహంకారం, నమ్మకం లేకపోవడం, దురాశ వివాదాలకు దారితీస్తాయి. సరిగా అర్థం చేసుకుంటే పెద్ద పెద్ద సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు. వ్యాజ్యం కంటే ముందుగానే మధ్యవర్తిత్వం, చర్చలు ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడమనేది అత్యంత సాధికార పద్ధతి."

జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో మీడియేషన్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు, సీజేఐ జస్టిస్‌ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ రమణ మధ్యవర్తిత్వంలో కృష్ణభగవానుడు విజయవంతమై ఉంటే కురుక్షేత్ర యుద్ధం ఆగి చాలాప్రాణాలు నిలబడగలిగేవని అభిప్రాయపడ్డారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించే విద్యార్థులు, న్యాయవాదులు మధ్యవర్తిత్వంలో నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: సీఎం ట్విట్టర్ ఖాతా హ్యాక్.. అరగంటలో 500 ట్వీట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.