సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా.. అధికారిక నివాసంలో పని చేసే సిబ్బంది అందరూ కరోనా బారినపడ్డారు. ఓ కేసు విచారణ సందర్భంగా ఆ విషయాన్ని వెల్లడించారు జడ్జి.
జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో ఉన్న ఆయన.. తన అధికారిక నివాసంలోని సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్లు న్యాయవాదులకు తెలిపారు. కరోనా పరిస్థితులను అదుపు చేసేందుకు తగినంత సమయం తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి.
కొద్ది రోజుల క్రితమే సుప్రీం కోర్టులోని 40 మందికిపైగా సిబ్బంది కరోనా బారినపడ్డారు.
సుప్రీంకోర్టు.. ప్రస్తుతం వర్చువల్‌గా కేసుల విచారణ చేపడుతోంది.
ఇదీ చూడండి: దిల్లీలో వారాంతపు కర్ఫ్యూ- మాల్స్, జిమ్‌లు మూసివేత