గుజరాత్ అహ్మదాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. తన భార్యను వేధిస్తున్నాడనే కోపంతో స్నేహితుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. అనంతరం సాక్ష్యాలు లభించకుండా ఉండేందుకు శరీరాన్ని ముక్కముక్కలుగా చేసి చెత్తకుప్పలో వేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాపునగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే మహ్మద్ మీరజ్, మహ్మాద్ ఇమ్రాన్ ఇద్దరు స్నేహితులు. ఇమ్రాన్ కోసం ఇంటికి వెళ్లే మీరజ్.. అతడి భార్యను తరుచూ వేధించేవాడు. దీనిపై ఆగ్రహించిన ఇమ్రాన్.. ఇంటికి రావద్దని హెచ్చరించాడు. అయినా మీరజ్ తీరు మారకపోవడం వల్ల అతడిని చంపాలని ఇమ్రాన్ ప్లాన్ చేశాడు. దీనికి అతడి భార్య కూడా సహాయం చేసింది. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామంటూ మీరజ్‌ను ఇద్దరు కలిసి ఇంటికి పిలిచారు. అతడి కళ్లకు గంతలు కట్టి.. కత్తితో పొడిచారు. అనంతరం సాక్ష్యాలు లభించుకుండా ఉండేందుకు శరీరాన్ని ముక్కముక్కలుగా నరికి చెత్తకుప్పలో వేశారు.
అయితే, కొన్ని రోజులుగా తమ కుమారుడు కనిపించకపోవడం వల్ల మీరజ్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతడి స్నేహితుడు ఇమ్రాన్‌పై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. తన భార్యను వేధిస్తున్నందునే హత్య చేశానని ఒప్పుకున్నాడు. అనంతరం ఇమ్రాన్‌ను తీసుకెళ్లి శరీర భాగాలను సేకరించారు. నిందితుడు మహ్మాద్ ఇమ్రాన్ సహా అతడి భార్యను అరెస్ట్ చేశారు పోలీసులు.
ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని పలామూ జిల్లాలో జరిగింది. ఇద్దరు కూతుళ్లు, కుమారుడితో కలిసి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన డల్టన్గంజ్ రైల్వే స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో జరిగింది. వీరిని హరిహరగంజ్ ప్రాంతానికి చెందిన మనితాదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు, కుమారుడిగా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టమ్ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆర్మీ అధికారి ఆత్మహత్య
తమిళనాడుకు చెందిన ఓ ఆర్మీ అధికారి సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో జరిగింది. మదురై జిల్లాకు చెందిన విగ్నేశ్ సుందర్.. భంథారా ఎయిర్ స్టేషన్లో సిగ్నల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. బుధవారం అతడికి గార్డ్ పోస్ట్ వద్ద సెంట్రీ విధులు వేయగా.. అక్కడే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న భంథారా పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
9 ఏళ్ల బాలిక గొంతుకోసి హత్య
జమ్ముకశ్మీర్ కుప్వారాలో ఘోరం జరిగింది. 9 ఏళ్ల బాలికను గొంతు కోసి చంపారు దుండగులు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఖుర్హామ సమీపంలో జాబ్ గ్రామంలో విడిచిపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి : ప్రియుడితో పారిపోయేందుకు ప్లాన్.. తనలా ఉన్న మరో అమ్మాయిని చంపి ఎస్కేప్
27 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన హనుమంతుడు.. రూ.42 లక్షలు పూచికత్తుతో బయటకు