ETV Bharat / bharat

'రైతులు ఆందోళనలు విరమించి.. ఇళ్లకు వెళ్లాలి' - రైతుల ఆందోలనలు

కొత్త వ్యవసాయ చట్టాల రద్దు(farm laws repeal) బిల్లును శీతాకాల సమావేశాల తొలిరోజే పార్లమెంట్​లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఈ క్రమంలో రైతులు ఆందోళనలు విరమించి.. తిరిగి ఇళ్లకు వెళ్లాలని కోరారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి(Agriculture Minister) నరేంద్ర సింగ్​ తోమర్​. కనీస మద్దతు ధర కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Agriculture Minister Narendra Tomar
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్
author img

By

Published : Nov 27, 2021, 1:40 PM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు విరమించాలని కోరారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి(Agriculture Minister) నరేంద్ర సింగ్​ తోమర్​. వ్యవసాయ చట్టాలను రద్దు(farm laws repeal) చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news) ప్రకటించిన క్రమంలో తిరిగి ఇళ్లకు వెళ్లాలని సూచించారు. ఆందోళనలు కొనసాగించేందుకు ఎలాంటి కారణం లేదని స్పష్టం చేశారు.

" పార్లమెంట్​ శీతాకాల సమావేశాల తొలిరోజునే సాగు చట్టాల రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నాం. పంట మార్పిడి, జీరో బడ్జెట్​ సాగు, అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టంగా కనీస మద్దతు ధర వ్యవస్థను మార్చేందుకు ప్రధాని మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారు. దీని ద్వారా కనీస మద్దతు ధర డిమాండ్​ నెరవేరుతుంది. పంట వ్యర్థాలను కాల్చటాన్ని నేరంగా పరిగణించకూడదని రైతు సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. ఈ డిమాండ్​ను భారత ప్రభుత్వం ఆమోదించింది. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించాక.. ఆందోళనలు కొనసాగించేందుకు ఎలాంటి కారణం లేదు. రైతులు తమ ఆందోళనలు ముగించి ఇళ్లకు వెళ్లిపోవాలి. "

- నరేంద్ర సింగ్​ తోమర్​, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.

2020, నవంబర్​ 26 నుంచి దిల్లీలోని వేరువేరు సరిహద్దుల వద్ద రైతులు ఆందోళనలు(Farmers protest) చేస్తున్నారు. గతవారం సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తామని తెలిపారు. ఎంఎస్​పీపై కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

మరోవైపు.. మూడు వ్యవసాయ చట్టాల రద్దు(Farm laws repealed) బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. సోమవారం సభాకార్యకలాపాల జాబితాలో బిల్లును చేర్చింది ప్రభుత్వం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​.. లోక్​సభలో సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. శీతాకాల సమావేశాల్లో ప్రవేశపట్టాలని కేంద్ర భావిస్తున్న 26 బిల్లుల్లో సాగు చట్టాల రద్దు బిల్లు కూడా ఉంది.

ఇదీ చూడండి: కనీస మద్దతు ధరపై చట్టం తేవాల్సిందే: టికాయిత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.