ETV Bharat / bharat

దిల్లీకి 15 మంది ఛత్తీస్​గఢ్​ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - ఛత్తీస్​గఢ్​ న్యూస్ టుడే

కాంగ్రెస్​కు వరుసగా షాక్​లు తగులుతున్నాయి. పంజాబ్​ కాంగ్రెస్​ వివాదం ముగియక ముందే ఛత్తీస్​గఢ్​(Chhattisgarh Congress News) వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం 15 మంది ఎమ్మెల్యేలు రాహుల్​ గాంధీని కలిసేందుకు దిల్లీ వెళ్లారు.

Chhattisgarh
ఛత్తీస్​గఢ్
author img

By

Published : Sep 30, 2021, 5:43 AM IST

నెల క్రితం ముగిసిపోయిందని ప్రకటించిన నాయకత్వ సమస్య ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh Congress News) అధికార కాంగ్రెస్‌లో తిరిగి మొదలయ్యిందా? ఆ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు బుధవారం దిల్లీకి వెళ్లడం వల్ల 'ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం' మళ్లీ మొదటికి వచ్చిందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌(Chhattisgarh CM) స్థానంలో సింగ్‌దేవ్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలంటూ ఆగస్టు నెలలో ఇరు వర్గాలు దిల్లీకి వెళ్లి అధిష్ఠానాన్ని కలిశాయి. రాహుల్‌ గాంధీ సర్దిచెప్పి వివాదం ముగిసిందని ప్రకటించారు.

పంజాబ్‌ కాంగ్రెస్‌లో వివాదం ముదిరిపాకాన పడుతున్న సమయంలో ఛత్తీస్‌గఢ్‌ వ్యవహారం మళ్లీ తెరమీదకు రావడం గమనార్హం. కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఇది మరో తలనొప్పి వ్యవహారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దిల్లీకి వచ్చిన 15 మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన బృహస్పతి సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీని కలిసేందుకు మాత్రమే దిల్లీ వచ్చామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

రాహుల్​తో భూపేశ్ భేటీ.. సీఎం మార్పు అనివార్యమా?

సీఎం మార్పుపై కుదిరిన రాజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.