ETV Bharat / bharat

Aditya L1 Mission Update : భూమికి బై.. బై.. సూర్యుడి దిశగా ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్య.. ట్వీట్ చేసిన ఇస్రో - ఆదిత్య ఎల్1 మిషన్ ప్రారంభ తేదీ 2023

Aditya L1 Mission Update : ఆదిత్య ఎల్‌-1 మిషన్​లో.. మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉపగ్రహ కక్ష్యను మరోసారి పెంచారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌-1 దిశలో విజయవంతంగా దానిని ప్రవేశపట్టారు.

aditya-l1-mission-update-today-aditya-l1-gets-send-off-from-earth-as-isro-performs-key-manoeuvre

author img

By PTI

Published : Sep 19, 2023, 7:31 AM IST

Updated : Sep 19, 2023, 7:42 AM IST

Aditya L1 Mission Update : సూర్యుడి రహస్యాలను చేధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి మిషన్‌ ఆదిత్య ఎల్‌-1 ప్రయోగంలో.. మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్యను పెంచిన ఇస్త్రో శాస్త్రవేత్తలు.. దానిని సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌-1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి తాజాగా ఎక్స్‌(ట్విటర్‌లో) ఓ పోస్టు చేసింది ఇస్రో. ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.

  • Aditya-L1 Mission:
    Off to Sun-Earth L1 point!

    The Trans-Lagrangean Point 1 Insertion (TL1I) maneuvre is performed successfully.

    The spacecraft is now on a trajectory that will take it to the Sun-Earth L1 point. It will be injected into an orbit around L1 through a maneuver… pic.twitter.com/H7GoY0R44I

    — ISRO (@isro) September 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వాహక నౌక ప్రస్తుతం లగ్రాంజ్‌ పాయింట్‌-1 దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్ష్యను 4 సార్లు పెంచారు. తాజాగా 5వ సారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలోని లంగ్రాజ్‌ పాయింట్‌-1 వైపు వెళ్లేలా విన్యాసం చేశారు. 110 రోజుల ప్రయాణం అనంతరం.. ఆదిత్య ఎల్‌-1ను మరొక విన్యాసంతో లగ్రాంజ్‌ పాయింట్‌-1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెడతారు శాస్త్రవేత్తలు.

15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్‌ పాయింట్‌-1 వైపుగా ఆదిత్య ఎల్‌-1 ప్రయాణం..
Aditya l1 Mission ISRO : చంద్రయాన్‌-3 విజయవంతం తర్వాత సూర్యుడిని పరిశోధించేందుకు సెప్టెంబర్‌ 2న ఆదిత్య-ఎల్‌ 1 ప్రయోగం చేపట్టింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. పీఎస్‌ఎల్‌వీ సీ-57 వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టారు శాస్త్రవేత్తలు. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. భారత్‌ తరఫున సూర్యుడిని అధ్యయనం చేసే ఇస్రో తొలి మిషన్‌ ఇదే కావడం విశేషం. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్‌ పాయింట్‌-1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ సూర్యుడిపై పరిశోధనలు మొదలు పెడుతుంది ఆదిత్య ఎల్‌-1.

ఆదిత్య-ఎల్​1 డేటా సేకరణ స్టార్ట్​.. ఏం రహస్యాలు తెలుస్తాయంటే..
Aditya L1 Mission Latest News : సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో పంపిన ఆదిత్య ఎల్‌-1.. శాస్త్రీయ డేటాను సేకరించడం మొదలు పెట్టింది. భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్‌ ప్రవర్తనను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఈ డేటా ఉపయోగపడనుంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Aditya L1 Takes Selfie : సెల్ఫీ తీసుకున్న ఆదిత్య ఎల్‌-1.. భూమి, చంద్రుడి ఫోటోలు కూడా..

Chandrayaan 3 Soft Landing Again : ఈసారి మనుషులతో 'చంద్రయాన్​'.. ఇస్రో విక్రమ్ 'రిటర్న్' జర్నీ సక్సెస్​!

Last Updated : Sep 19, 2023, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.