young woman was attacked with a knife in Borabanda: ప్రేమ అందమైన అనుభూతి.. ప్రేమలో స్వార్థం ఉండదు.. నమ్మకమే ఉంటుంది. అలాంటి ప్రేమను పొందలంటే ఏం చేయాలి అమ్మాయిని పరిచయం చేసుకోవాలి. మన మనసు, అలవాట్లను వారికి తెలియనివ్వాలి. అప్పుడు అడిగి చూడు ప్రేమంటే ఏంటో వారే రుచి చూపిస్తారు. లేకుంటే అది వారి ఖర్మరా బాబు మనలాంటి మంచి వాళ్లను వారు దూరం చేసుకుంటున్నారు.
అలా అనుకోవాలనే గానీ.. ప్రేమోన్మాదిగా మారి ఇలా రోడ్లపై అమ్మయిలపై దాడులు చేస్తే ప్రేమిస్తారా. తాజాగా హైదరాబాద్‌లో కూడా ఓ అబ్బాయి కూడా అలానే చేశాడు. ఏడేళ్లుగా తన చుట్టూ తిరుగుతున్న కనీసం పట్టించుకోవడం లేదని అమ్మాయి గొంతుకోసేందుకు తెగపడ్డాడు. అమ్మాయి ప్రతిఘటించడంతో పాటు.. స్థానికులు చూడటంతో వారి చేతిలో చావు దెబ్బలు తిని పోలీసుల అదుపులో ఉన్నాడు.
స్థానికుల కథనం ప్రకారం.. బోరబండ బంజారానగర్‌లో ఓ యువతిపై యువకుడు పట్టపగలే కత్తితో దాడి చేశాడు. ఆ యువతి గొంతు కోసేందుకు యువకుడి ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకొని యువకుడిని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన యువతిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. యువకుడు బాధిత యువతిని ప్రేమ పేరుతో గత ఏడేళ్లుగా వేధిస్తున్నాడని చెబుతున్నారు. యువతి ప్రేమను నిరాకరించడంతో ఇలా దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన యువకుడిని కిశోర్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
"సాయంత్రం సుమారు 4-30నిమిషాలకు ఆ అమ్మాయి బైక్‌పై వస్తోంది. ఈ క్రమంలో అతను ఆ అమ్మాయిని అడ్డుకొని గొడవకు దిగాడు. అమ్మాయి హెల్మెట్ తీస్తున్న సమయంలో గొంతుపై కత్తితో దాడి చేశాడు. ఈలోగా ఆటోలో వెళ్తున్న కొందరు అడ్డుకొని అతని తగ్గర కత్తిని తీసుకొని ఆ అబ్బాయిని చితకబాదారు. అమ్మాయిని మేము ఆసుపత్రిలో జాయిన్ చేయించాం."- ప్రత్యక్ష సాక్షి
ప్రేమోన్నాదులతో తస్మాత్ జాగ్రత: తన ప్రేమను నిరాకరించరని లేకుంటే తనను కాదనుకొని వేరేవాళ్లతో సన్నిహితంగా ఉంటున్నారని ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో యువతలు, బాలికలపై దాడులు పెరిగిపోతున్నాయి. కొందరు యువకులు పైశాచికంగా వ్యవహరించి కత్తులతో, యాసిడ్ బాటిల్‌తో అమ్మాయిలపై దాడులకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని ముందుగానే గుర్తించి వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ప్రేమ పేరుతో ఎవరైనా వెంటపడిన.. బెదిరించిన ఇంటి దగ్గర పెద్దవాళ్లతో లేదా నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అలా చేస్తే వారిపై తగు చర్యలు తీసుకోవడం లేదా కౌన్సిలింగ్ ఇవ్వడం చేస్తామని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
అనుమానం పెనుభూతమైంది.. చివరకు ఏం జరిగిందంటే..
'మరణంలోనూ.. నేనున్నానని.. నీతో వస్తానని'.. భద్రాద్రి దంపతుల హార్ట్ టచింగ్ స్టోరీ
శ్రద్ధా వాకర్ తరహా మరో ఘటన.. వ్యక్తిని ముక్కలుగా నరికి చంపిన భార్యాభర్తలు