ETV Bharat / bharat

పొలంలో నిధులున్నాయని స్వామీజీ మోసం, రూ 5 లక్షలతో జంప్​ - దంపతులని మోసం చేసిన స్వామీజీ

పొలంలో నిధులు ఉన్నాయని దంపతులను మోసం చేశాడో దొంగ స్వామీజీ. ఐదు లక్షల డబ్బుతో ఉడాయించాడు. ఆలస్యంగా తేరుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

A fake Swamiji cheated
A fake Swamiji cheated a couple to the tune of Rs. 5 lakhs after offering treasure from their filed
author img

By

Published : Aug 21, 2022, 11:22 AM IST

Updated : Aug 21, 2022, 11:53 AM IST

Fake Swamiji Cheated Couple: పొలంలో నిధి ఉందని దంపతులను మోసం చేశాడో దొంగ స్వామీజీ. వారి వద్ద నుంచి రూ.5 లక్షలు స్వాహా చేసి పారిపోయాడు. కర్ణాటకలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మంజేగౌడ, లీలావతి దంపతులు కర్ణాటకలోని హసన్​ జిల్లా దొడ్మగ్గే గ్రామానికి చెందినవారు. వీరిని ఒక స్వామీజీ కలిసి వారి పొలంలో నిధి ఉందని చెప్పాడు. తనలోని దైవిక శక్తితో దాన్ని బయటకు తీస్తానని నమ్మించాడు. అయితే మోసం చేయాలని పథకం పన్నిన స్వామీజీ.. అంతకుముందే మంజే గౌడ పొలంలో 3 కిలోల బంగారు పూతపూసిన వెండి విగ్రహాన్ని పాతిపెట్టాడు. ఒకరోజు రాత్రి దంపతులను పొలానికి తీసుకెళ్లాడు. పూజలు చేసి భూమిలో నుంచి విగ్రహాన్ని బయటకు తీశాడు. దాన్ని నీళ్లతో కడిగించాడు. రక్తంతో అభిషేకం చేయాలని లీలావతి వేలు కోసాడు. ఆమె వేలు నరాలు తెగాయి. ఈ ఘనకార్యం చేసినందుకు స్వామీజీకి 5 లక్షలు ముట్టజెప్పారీ దంపతులు.

పొలంలో నిధులున్నాయని మోసం

కొద్ది రోజులు గడిచాక భార్యాభర్తలు ఓ జువెలరీ షాప్​లో విగ్రహాన్ని పరీక్షించారు. దీంతో అది వెండి విగ్రహమని తెలిసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు స్వామీజీ ఫోన్​ స్విచ్​ ఆఫ్​ చేసి, డబ్బులతో ఉడాయించాడు. ఈ ఘటనపై అరకలగూడు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

swamiji cheated
నిందితుడు

ఇవీ చదవండి: రైలు పట్టాలపై ఐఐటీ విద్యార్థిని మృతదేహం, కారణాలేంటి

పాము కాటుతో ఐదేళ్ల చిన్నారి మృతి, తల్లిని కాపాడబోయి

Last Updated : Aug 21, 2022, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.