ETV Bharat / bharat

చిన్నారులపై తల్లిదండ్రుల క్రూరత్వం - father and stepmother beat kids brutally

కొన్ని నెలలుగా చిన్నారులను చిత్రహింసలకు గురిచేసిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆ పసివాళ్లకు తల్లిదండ్రుల చెర నుంచి విముక్తి కలిగినట్టు అయింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ ఘటన జరిగింది.

6-year-old-girl-and-4-year-old-boy-was-brutally-beaten-by-father-and-stepmother
చిన్నారులపై తల్లిదండ్రుల క్రూరత్వం
author img

By

Published : Feb 10, 2021, 8:23 PM IST

అభంశుభం తెలియని ఆ పసిపిల్లలపై తండ్రి, సవతి తల్లి కలిసి కిరాతకంగా దాడి చేశారు. లాడ్జిలోని ఓ గదిలో వారిని బంధించి చిత్ర హింసలు పెట్టారు. ఎట్టకేలకు ఇరుగుపొరుగు వారి సమాచారంతో ఆ పిల్లలకు విముక్తి కలిగింది. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లా మంబాద్ పట్టణంలో జరిగింది.

చిన్నారులపై తల్లిదండ్రుల క్రూరత్వం

అసలు ఏం జరిగింది?

తమిళనాడుకు చెందిన నిందితుడు తనకరాజ్​కు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె పద్మప్రియకు పదేళ్లు కాగా కుమారుడు దువసేన్​కు ఐదేళ్లు. నిందితురాలు మైయమ్ముతో కలిసి వీరిని కొన్ని నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. చిన్నారుల ఒంటినిండా కాలిన గుర్తులు సహా కుమార్తె పద్మప్రియ కళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

kerala, kids tortured by parents
చికిత్స పొందుతున్న చిన్నారులు
kerala, kids tortured by parents
తీవ్రంగా గాయపడిన చిన్నారి పద్మప్రియ

చిన్నారులను మంబాద్​ ఓ ప్రైవేట్​ లాడ్జిలో బంధించారు. బుధవారం ఉదయం సుమారు 10.30 గంటలకు పక్క గదిలో ఉన్న ఓ మహిళ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న అధికారులు పిల్లలను వారి చెర నుంచి విడిపించారు. పిల్లల బాధ్యతను అధికారులు బాలల పరిరక్షణ కమిటీకు అప్పగించారు. ప్రస్తుతం చిన్నారులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నిలాంబూర్ ఠాణాకు తరలించారు.

ఇదీ చదవండి : బంగాల్​ దంగల్: నడ్డా, దీదీ మాటల యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.