ఓ మహిళ కడుపులో ఉన్న ఆరున్నర కేజీల కణితిని తొలగించారు ప్రభుత్వ వైద్యులు. నాలుగు గంటల పాటు శ్రమించిన వైద్యులు.. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఘటన బంగాల్లో జరిగింది. మొదట మహిళకు గర్భంగా భావించిన వైద్యులు.. పరీక్షల అనంతరం ఆశ్చర్యపోయారు. కడుపులో ఉన్నది ఒక కణితి అని.. అది అసాధారణ స్థాయిలో పెరిగిందని గుర్తించారు.
ఇదీ జరిగింది
రామ హల్దర్ అనే మహిళ కోల్‌కతాలోని డమ్‌డమ్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. సుమారు ఏడాదిన్నరగా ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. గత కొద్ది రోజులుగా ఆ నొప్పి మరింత తీవ్రం అయింది. ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరూ లేని కారణంగా పక్కింటి వారి సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యుల బృందం ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. శనివారం సాయంత్రం ఈ ఆపరేషన్ జరిగింది. కణితి సుమారు 70 శాతం కడుపు బాగాన్ని ఆక్రమించిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు.