ETV Bharat / bharat

ఐదేళ్లుగా వెంటిలేటర్​పై చిన్నారి.. తీస్తే రెండు నిమిషాల్లోనే.. - 5 ఏళ్లుగా వెంటిలేటర్​పై ఏడేళ్ల చిన్నారి

ఓ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఐదు సంవత్సరాలుగా వెంటిలేటర్​పై ఉంటూ చావుతో పోరాడుతోంది. వెంటిలేటర్​ తీసేస్తే రెండు నిమిషాల కన్నా ఎక్కువ బతకదని వైద్యులు చెబుతున్నారు. ఝార్ఖండ్​కు చెందిన ఏడేళ్ల చిన్నారి దీన గాథ ఇది..

girl on ventilator for 5 years
girl on ventilator for 5 years
author img

By

Published : Nov 15, 2022, 2:04 PM IST

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆస్పత్రే ఇల్లుగా మారిపోయింది. ఐదేళ్లుగా అక్కడే ఉంటోంది. వెంటిలేటర్​పై ఉంటూ ప్రతి క్షణం చావుతో పోరాడుతోంది. ఝార్ఖండ్​కు చెందిన సౌమిలి తివారి అనే చిన్నారి.. 2017లో రెండున్నరేళ్ల వయసులో అనారోగ్యంతో కోల్​కతాలోని ముకుందాపుర్​ ఏఎమ్ఆర్​ఐ ఆస్పత్రిలో చేరింది. ఆనాటి నుంచి ఐదేళ్లుగా వెంటిలేటర్​పై చికిత్స తీసుకుంటోంది. ఇప్పుడు ఆ చిన్నారి వయసు ఏడేళ్లు. ఇప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగు పడలేదు. ప్రస్తుతం సౌమిలి.. ఏఎమ్ఆర్​ఐ ఆస్పత్రి, పీడియాట్రిక్ ఐసీయూ​ విభాగాధిపతి డాక్టర్​ సౌమెన్​ మీర్​ పర్యవేక్షణలో ఉంది. అయితే ఏదైనా అద్భుతం జరిగిదే తప్ప.. మిగతా పిల్లలలాగా ఆ చిన్నారి నవ్వలేదని, ఆడుకోలేదని డాక్టర్​ సౌమెన్​ మీర్​ అన్నారు. ఇంకా ఎన్నిరోజులు బతుకుతుందో అనేది తమముందు ఉన్న పెద్ద ప్రశ్న అని 'ఈటీవీ భారత్​'కు ఆయన వెల్లడించారు.

"ఆ చిన్నారి 2017లో శ్వాస సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. అప్పుడు ఆ చిన్నారి వయసు రెండున్నర సంవత్సరాలు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేది. వెన్నెముక, మెడ పరీక్షల అనంతరం.. మెడ​లో కణతి ఉందని తేలింది. దీన్నే వైద్య పరిభాషలో 'న్యూరోసైగ్లోమెట్రోసిస్(neurocyglometrosis)' అంటారు. ఈ వ్యాధి వచ్చిన వారికి నరంపై కణతి పెరుగుతుంది. ఈ చిన్నారికి అలా కణతి పెరిగి పుర్రెపై ఒత్తిడిని పెరిగింది. దాంతో ఆమె పుర్రె డ్యామేజ్ అయ్యింది. అందుకే ఆమె శరీర భాగాలు సరిగా స్పందించలేకపోతున్నాయి. దీంతో ఆమె శరీరం భుజాల నుంచి కాళ్ల వరకు చచ్చుబడిపోయింది. దీనికి ఆమెకు శ్వాస సమస్య కూడా తోడైంది. అందుకే ఆమెను వెంటిలేటర్​పై ఉంచాము. అది తీసేస్తే రెండు నిమిషాల్లో చిన్నారి చనిపోతుంది"

- సౌమెన్​ మీర్​, డాక్టర్​

ఎన్నేళ్లు వెంటిలేటర్​పై ఉంచితే చిన్నారికి ఎంతవరకు మంచిది? అన్న ప్రశ్నకు డాక్టర్​ సౌమెన్ సమాధానమిచ్చారు. వెంటిలేటర్​ తొలగించిన రెండు నిమిషాల్లో చిన్నారి మరణిస్తుందని చెప్పారు. ఇన్నేళ్లు చికిత్స ఇచ్చినా ఆమెకు వ్యాధి నయం కాలేదని.. ఇలాంటి పేషెంట్లు వెంటిలేటర్​పై ఉన్నప్పుడు తరచూ న్యుమోనియాకు గురవుతారని చెప్పారు. అలా ఊపిరితిత్తులు చెడిపోయి.. వారిని కాపాడటం కష్టమవుతుందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి : పామును ముద్దాడబోయి ప్రాణాలు కోల్పోయిన సంరక్షకుడు

ప్రమాదవశాత్తు బావిలో పడిన 11 అడుగుల కోబ్రా సురక్షితంగా బయటకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.