ETV Bharat / bharat

'ఆ పార్టీ ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారు.. కానీ ఆ చెత్త మాకెందుకు?'

Arvind Kejriwal News: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమ్​ ఆద్మీ పార్టీలోకి కనీసం 25 మంది ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ అన్నారు. అంతేగాకుండా మరో ఇద్దరు ఎంపీలు ఆప్​లోకి వచ్చేందుకు తమ నేతలతో టచ్​లో ఉన్నట్లు వెల్లడించారు.

Arvind Kejriwal
అరవింద్​ కేజ్రీవాల్
author img

By

Published : Nov 23, 2021, 7:09 PM IST

Punjab Election News: వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇతర పార్టీలకు చెందిన సుమారు 25 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఆమ్​ అద్మీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ (Arvind Kejriwal News) అన్నారు. ఈ క్రమంలో వారిని చెత్తతో పోల్చిన ఆయన.. వారిని చేర్చుకోవడం అనవసరమని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పంజాబ్​లో పర్యటించిన కేజ్రీవాల్​.. అమృత్​సర్​లో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ సమయంలోనే చాలామంది ఎమ్మెల్యేలు పార్టీలు మారుతారు. ఇది సాధారణంగా జరుగుతుంటుంది. అలాంటి వారిని మా పార్టీలోకి ఆహ్వానిస్తే.. కాంగ్రెస్​ పార్టీకి చెందిన కనీసం 25 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఆప్​లోకి వచ్చేందుకు మాతో టచ్​లో ఉన్నారు. కానీ వారు మాకు అవసరం లేదు. ఆ బ్యాచ్​ అంతా చెత్త."

- అరవింద్​ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

కాగా.. ఆప్​ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన రూపిందర్ కౌర్‌ సహా నలుగురు రెబల్​ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇదీ చూడండి: 'యూపీఏ అసమర్థ పాలన.. ఆ బుక్​తో విస్పష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.