150 Family Members Have above 20 Fingers : సాధారణంగా ఒక మనిషికి కాళ్లు, చేతులకు కలిపి 20 వేళ్లు ఉంటాయి. కొందరికి చేతులు లేదా కాళ్లకు ఆరువేళ్లు ఉంటుంటాయి. అయితే హరియాణాలోని పానీపత్కు చెందిన ఒకే కుటుంబంలోని 150 మందికి చేతులు లేదా కాళ్లకు ఆరు వేళ్లు ఉన్నాయి. అదేంటి ఒకే కుటుంబానికి చెందినవారికి ఇలా అవ్వడమేంటని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదివేయండి.
పానీపత్లోని బాబర్పుర్కు చెందిన జానీ కుటుంబంలోని 150 మందికి కాళ్లు లేదా చేతులకు ఆరు వేళ్లు ఉన్నాయి. మొత్తం కలిపి తమ కుటుంబంలోని 150 మందికి 20 వేళ్లకుపైగా ఉన్నాయని కుటుంబ సభ్యుడు జానీ చెప్పాడు. తన తండ్రి కాలికి ఆరు వేళ్లు ఉండేవని.. పెద్ద కుమారుడికి సైతం కాళ్లకు ఆరు వేళ్లు ఉన్నాయని తెలిపాడు. ఇలా కాళ్లు లేదా చేతులకు 6వేళ్లు ఉండడం తమకు ఎలాంటి సమస్య అనిపించదని పేర్కొన్నాడు. అయితే చెప్పులు, షూస్ వేసుకునే సమయంలో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందని అన్నాడు. తన కుటుంబంలో కొంత మంది బాబర్పుర్లో.. మరికొందరు పానీపత్ పక్కనే ఉన్న నోహ్రా గ్రామంలో నివసిస్తున్నారని వివరించాడు.
ఇంతకీ వైద్యులు ఏమంటున్నారంటే?
ఒకే కుటుంబంలో చాలా మంది ఆరు వేళ్లతో పుట్టడాన్ని వైద్య పరిభాషలో పాలీడాక్టిలీ అంటారని వైద్యాధికారి డాక్టర్ జైన్శ్రీ తెలిపారు. శరీరంలోని క్రోమోజోములు, జీన్స్ ప్రభావం వల్ల ఇలా జరుగుతుందని చెప్పారు. జీన్స్ ప్రభావం వల్ల తల్లిదండ్రుల నుంచి సంతానానికి పాలీడాక్టిలీ సంక్రమిస్తుందని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రుల పెద్ద కుమారుడికి పాలీడాక్టిలీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియోపతిలో దీని చికిత్స సాధ్యమవుతుందని చెప్పారు.
Baby Born With 26 Fingers In Rajasthan : రాజస్థాన్లో కొద్ది రోజుల క్రితం ఓ నవజాత శిశువు 26 వేళ్లతో జన్మించింది. ఆ చిన్నారి చెరో చేతికి 7 వేళ్లు ఉండగా.. ఒక్కో కాలికి ఆరు వేళ్లు చొప్పున మొత్తం 26 ఉన్నాయి. ఆ బిడ్డను ఆమె కుటుంబ సభ్యులు దేవతగా భావిస్తున్నారు. చిన్నారి పుట్టుక పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.