vanjangi hills beauty: కనువిందు చేస్తున్న.. వంజంగి మేఘాల కొండ.. - ap news
🎬 Watch Now: Feature Video
విశాఖ మన్యం వంజంగిలో ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెల్లవారు జామున కురిసే దట్టమైన మంచుకి గిరి శిఖరాలు పాల సముద్రాన్ని తలపిస్తున్నాయి. పొగమంచు కురుస్తుండడంతో గిరి శిఖరాలను తాకుతూ అలుముకున్న దట్టమైన పొగమంచు అందాలను వీక్షించడానికి పర్యటకులు ఆసక్తి చూపుతున్నారు. అక్కడి నయనానందకర దృశ్యాలను తమ పోన్లలో బంధిస్తున్నారు.